నిన్న హనుమకొండ కోర్టులో మధ్యాహాన్నం రెండు గంటలనుంచి రాత్రి వరకు జరిగిన వాదోపవాదాల తరువాత బండి సంజయ్ ని జడ్జి విడుదల చేశారు. బండి సంజయ్ బయటికి రాగానే ముందుగా మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్ ని టార్గెట్ చేస్తూ పలు హెచ్చరికలు చేశారు. పలు సవాళ్ళు విసిరారు. అందులో ముఖ్యమైనది ”కెసిఆర్ కి దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో పదో తరగతి పరీక్ష లీకేజీ మీద దర్యాప్తు చేయిస్తావా?” అని సవాల్ విసిరారు.
”పదో తరగతి హిందీ పరీక్ష పేపర్ని నేను లీక్ చేస్తే, మరి తెలుగు పేపర్ని ఎవరు లీక్ చేసినట్లు?” అని సూటిగా ప్రశ్నించారు.
”ఆ అవసరం నాకు ఎందుకు వస్తుంది?” అని ప్రశ్నించారు.
”అసలు పరీక్షన హాలులోకి సెల్ ఫోన్ వెళ్ళితే పోలీసులు ఏం చేసున్నారు?” అని నిలదీశారు.
ఒక ఎంపి ని అరెస్ట్ చేయాలంటే ముందుగా అరెస్ట్ వారెంట్ ఇవ్వలని పోలీసులకు తెలియదా? అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తే నిరంకుశ పాలనతో కెసిఆర్ రెచ్చిపోతున్నాడు అని విరుచుకుపడ్డారు.
దీనికి కౌంటర్ గా నిరుద్యోగులతో ధర్నాలు చేసి కెసిఆర్ అసమర్థ పాలన, అరాచక పాలనను ప్రజల్లోకి తీసుకుని వెళ్తాము అని ఘాటుగా హెచ్చరించారు.
అయితే మోడీ నగరానికి వచ్చి వెళ్ళాకా బండిని నాలుగో గేర్ లో నడిపిస్తాను అని హెచ్చరించారు.