చిలకలూరిపేటలో వైసీపీ నిర్వహించిన సభలో సీఎం జగన్ ముందే బరస్ట్ అయ్యారు ఎంపీ లావు కృష్ణదేవరాయులు. తనను ఏమాత్రం పట్టించుకోవడం లేదని…అధికారిక కార్యక్రమాలకు కూడా వైసీపీ నేతలు దూరం పెడుతున్నారని అందరూ చూస్తుండగానే కృష్ణదేవరాయులు చెప్పడంతో జగన్ సైతం ఖంగుతిన్నారు.
మంత్రి విడదల రజిని.. ఎంపీ కృష్ణదేవరాయులు మధ్య కొంతకాలంగా వర్గపోరు నడుస్తోంది. దీంతో నరసరావుపేట నియోజకవర్గంలో ఇతర ఎమ్మెల్యేలు కూడా ఎంపీని పట్టించుకోవడం లేదు. ఇదంతా విడదల రజిని చేయిస్తున్నారని ఎంపీ వర్గం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో చిలకలూరిపేటలో నిర్వహించిన సభలో పాల్గొనేందుకు వచ్చిన జగన్ వేదిక పైకి వెళ్తుండగా ఎంపీని కింద చూసి పలకరింగా ఆయన తనలోని ఆవేదనంత వెళ్లగక్కారు.
అధికారిక కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని..ప్రోటోకాల్ పాటించడం లేదని తాను లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో జగన్ ఉలిక్కి పడ్డారు. రా కృష్ణా అంటూ.. ఆయనను వేదికపైకి తీసుకెళ్లారు. ఈ ఘటన చిలుకలూరిపేట సభలో హైలెట్ అయింది.
ముఖ్యమంత్రి సభకు కూడా ఎంపీకి నామ్కే వాస్తేగా ఆహ్వానం అందింది. ముఖ్యమంత్రి వచ్చే వరకు ఎంపీని వేదిక పైకి పిలిచే సాహసం కూడా చేయలేదు. ఇది ఎంపీని మనస్తాపానికి గురి చేసి ఉండొచ్చు. అందుకే జగన్ కనిపించగానే ఎవరేమైన అనుకోని..జగన్ ఎలాంటి చర్యలైనా తీసుకొని పరవాలేదు అన్నట్లుగా జగన్ ముందే బరస్ట్ అయ్యారు లావు కృష్ణదేవరరాయులు. అది వీడియోలో రికార్డయింది.
Also Read : జగన్ కు బిగ్ షాక్ – కీలక సమావేశానికి కొడాలి, వల్లభనేని వంశీలు డుమ్మా