వైసీపీలో జగన్ తరువాత అంత సజ్జల రామకృష్ణా రెడ్డిదే పెత్తనం. మారిన రాజకీయ పరిణామాలతో సజ్జల ప్లేసులో మరో కొత్త నేతను చూడబోతున్నాం. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో సజ్జలను నెంబర్ 2పొజిషన్ నుంచి తప్పించి తనతో సన్నిహితంగా మెదిలే మరో నేతకు బాధ్యతలు ఇవ్వాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
సజ్జల రామకృష్ణా రెడ్డి తీరుతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్నామని జగన్ ఓ అంచనాకు వచ్చారు. దాంతో సజ్జలను ఎక్కువ కాలం నెంబర్ టూ పొజిషన్ లో ఉంచితే వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీకి ప్రతికూల ఫలితాలు వస్తాయని.. అందుకే నెంబర్ 2స్థానంలో చెవిరెడ్డిని కూర్చోబెట్టాలని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా జగన్ కు చెవిరెడ్డి చాలా క్లోజ్ అయ్యారు. చిత్తూర్ జిల్లా నుంచి భూమన కరుణాకర్ రెడ్డి కంటే కూడా చెవిరెడ్డికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేంతగా జగన్ తో మూవ్ అవుతున్నారు.
తాజాగా నెంబర్ టు పొజిషన్ ను మార్చాలని నిర్ణయించుకోవడంతోనే చెవిరెడ్డిని ఎన్నికల్లో పోటీ చేయవద్దని… తన వద్దకు రావాలని జగన్ పిలిచినట్లుగా చెబుతున్నారు. వారసులకు టికెట్లు ఇవ్వబోమని ఎమ్మెల్యేలకు జగన్ తేల్చిచెప్పారు. కానీ చెవిరెడ్డికి మాత్రం మినహాయింపు ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నుంచి తన కుమారుడు పోటీ చేస్తాడని కార్యకర్తల సమావేశంలోనే చెవిరెడ్డి ప్రకటించారు. ఓ వైపు వారసులకు టికెట్లు లేవని పలువురు ఎమ్మెల్యేలకు జగన్ చెబుతుండగా…చెవిరెడ్డి మాత్రం వచ్చే ఎన్నికల్లో తన వారసుడు పోటీలో ఉంటాడని జగన్ కూడా అంగీకరించారని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మాన లాంటి సీనియర్ నేతలు వచ్చే ఎన్నికల్లో తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని జగన్ ను కోరుతున్నారు. కానీ వారందరికి జగన్ నో చెప్పేస్తుండగా ఒక్క చెవిరెడ్డికి మాత్రం ఎస్ చెప్పడం చూస్తుంటే… నెంబర్ పోస్ట్ లో చెవిరెడ్డిని కూర్చోబెట్టేందుకే ఆయన విజ్ఞప్తిని జగన్ మన్నించి ఉంటారని అంటున్నారు.
Also Read : సజ్జలను సాగనంపేందుకు రెడీ అవుతోన్న వైసీపీ