రాజన్న రాజ్యమంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల తెలంగాణలో చేస్తోన్న రాజకీయాలతో నలుగురిలో నవ్వుల పాలు అవుతున్నారు. పేపర్ లీక్ అంశంపై పోరాడటానికి తన పార్టీ బలం సరిపోదని అనుకున్నారో లేక ఈ అంశం ద్వారా రాజకీయాల్లో ఓ ముద్ర వేసుకోవాలని అనుకున్నారేమో. ఇతర పార్టీలతో కలిసి టీ- సేవ్ పేరుతో ఫోరం ఏర్పాటు చేసి సర్కార్ పై ఉద్యమించాలని షర్మిల అనుకున్నారు. ఇందుకోసం అన్ని పార్టీలను కలిసి సంప్రదింపులు జరుపుతూ ఎజెండా ఖరారు చేయాలనుకున్నారు.
కాంగ్రెస్ , బీజేపీ రాష్ట్ర అద్యక్షులు రేవంత్ , బండి సంజయ్ లకు ఫోన్ చేసి సంప్రదింపులు జరిపారు షర్మిల. నిరుద్యోగుల తరుఫున విడివిడిగా కాకుండా ఉమ్మడిగా కొట్లాడుదామని సూచనలు చేశారు. కానీ ఇందుకు రేవంత్ , బండి సంజయ్ లు కుదరదని సున్నితంగా షర్మిల సూచనను తిరస్కరించారు. కానీ ఎక్కడ నీ చిన్న పార్టీతో జాతీయ స్థాయి పార్టీలైనా తమ పార్టీలు జత కడుతాయని ఎలా అనుకున్నావని వైఎస్సార్ తెలంగాణ పార్టీ పరువు తీయలేదు. ఆ తరువాత కోదండరాంను కలిసి షర్మిల చర్చించారు. ఆయన ముందు కూడా టీ – సేవ్ ఫోరం ఏర్పాటును ఉంచారు. దాంతో కోదండరాం పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని చెప్పి షర్మిలను పంపించారు.
ఇదంతా బాగానే ఉంది. కానీ ఎవరూ షర్మిల పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు. పైగా వారి మధ్యలో పేపర్ లీక్ వ్యవహారం మినహా మరే ఇతర రాజకీయ అంశాలు చర్చకు రాలేదు. కాని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను షర్మిల కలవగా ఆమెను మరీ తేలికగా తీసుకొని మాట్లాడారు. సీపీఎం ఆఫీసుకు వెళ్లిన షర్మిల తమ్మినేనితో ఫోరం ఏర్పాటుపై మాట్లాడారు. అయితే తమ్మినేని మాత్రం బీఆర్ఎస్ పై పోరాడుతున్నారు కాని బీజేపీ చేసే ఆకృత్యాలు మీకు కనబడటం లేదా అని షర్మిలను ప్రశ్నించారు. షర్మిల పార్టీని బీజేపీ బీ – టీమ్ గా అభివర్ణించారు.
తమ్మినేని మాటలకు షర్మిల హార్ట్ అయ్యారు. తమది బీ-టీమ్ కాదని సీపీఎంనే బీ – టీమ్ అని.. అందుకే మీరు బీఆర్ఎస్ తో కలిసి పని చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు బదులిస్తూ.. తాము రహస్యంగా బీఆర్ఎస్ తో కలిసి పని చేయడం లేదని బహిరంగంగానే పని చేస్తున్నామని వ్యాఖ్యానించారు. దీంతో అవమానకరంగా సీపీఎం ఆఫీసు నుంచి షర్మిల వెనుదిరిగారు.
Also Read : ఇంతకీ వైఎస్ షర్మిల ఎవరు వదిలిన బాణం..?