టీఎస్ పీస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో అన్ని వర్గాలు సర్కార్ ను వేలెత్తిచూపిస్తున్నాయి. పేపర్ లీక్ సర్కార్ వైఫల్యమేనని ఆరోపిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ , బీజేపీలు పట్టుబడుతున్నాయి. కంప్యూటర్లను ఐటీ శాఖనే పర్యవేక్షేస్తుంది కాబట్టి ఆ శాఖ మంత్రి కేటీఆర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ టీఎస్ పీస్సీ పేపర్ లీక్ వివాదం ఇంకా సద్దుమణగనే లేదు అప్పుడే టెన్త్ పరీక్ష పేపర్లు లీక్ కావడంతో సర్కార్ పై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
తాజాగా రెండు టెన్త్ పేపర్లు వరుసగా లీక్ కావడంతో కేటీఆర్ తోపాటు సబితా ఇంద్రారెడ్డి కూడా తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని వైపుల నుంచి సర్కార్ పై ఒత్తిళ్ళు పెరుగుతున్నాయి. ఇదే డిమాండ్ తో కాంగ్రెస్ , బీజేపీలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. విద్యార్ధి సంఘాలు రోడ్డెక్కాయి. ప్రగతి భవన్ ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. అయితే.. వరుసగా టెన్త్ పేపర్లు లీక్ కావడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు..? మొద్దు నిద్ర పోతున్నారా..? అని సీరియస్ అయినట్లు సమాచారం.
సోమవారం రోజున టెన్త్ పేపర్ లీక్ అయితే ఎలాంటి చర్యలు తీసుకున్నారు..? అని కేసీఆర్ విద్యాశాఖ అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నలుగురిని విధుల నుంచి సస్పెండ్ చేశామని కేసీఆర్ కు సమాధానం ఇచ్చారు. అయితే.. వరుసగా పేపర్ లీక్ అవుతుండటంతో ప్రతిపక్షాలు సర్కార్ ను ఇరుకున పెట్టేలా రాజకీయాలు చేస్తున్నాయి. టీఎస్ పీస్సీ ప్రశ్నా పత్రాల లీక్ పై సిట్ దూకుడు పెంచుతోన్న వేళ కేటీఆర్ రాజీనామా చేయాలని పదేపదే డిమాండ్ చేయడం ప్రతిపక్షాలు తగ్గించాయి. దీంతో ఇప్పుడిప్పుడే ఈ వివాదం ఓ కొలిక్కి వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెన్త్ పేపర్ లీక్ కావడంతో కేటీఆర్ మరియు సబితా ఇంద్రారెడ్డిలు రాజీనామా చేయాలని మరోసారి గట్టిగా డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు.
దీంతో ఈ విషయంలో సర్కార్ బాధ్యతయుతంగా వ్యవహరిస్తుందని చెప్పేందుకు కేటీఆర్ పై వేటు వేయకుండా కేవలం సబితను మంత్రివర్గం నుంచి తప్పించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే..సబితాపై వేటు వేసి కేటీఆర్ ను మంత్రివర్గంలోనే కొనసాగిస్తే కొడుకు కోసం సబితను బలి చేశారని ప్రతిపక్షాలు మరింత మాటల దాడి పెంచుతాయని కేసీఆర్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు. అందుకే ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక కేసీఆర్ సతమతం అవుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చర్సిన్చుకుంటున్నాయి.
Also Read : బిగ్ బ్రేకింగ్ : మంత్రి సబితా రాజీనామా..?