జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ వెయ్యి కోట్ల ఆఫర్ చేశారని ఆ మధ్య ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే సంచలన కథనం వెలువరించారు. ఏపీలో ఒంటరిగా పోటీ చేసినా లేదా బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేసినా పవన్ కు వెయ్యి కోట్లు ఇచ్చేందుకు కేసీఆర్ బేరమాడుతున్నారని వీకెండ్ కామెంట్ లో ఆర్కే పేర్కొన్నారు. అప్పట్లో ఇది సంచలనం రేపింది.
ఆర్కే కథనంపై చాలామంది విమర్శలు చేశారు. సంచలనాల కోసం ఈ కథనం వెలువరించాడని ఆర్కేపై తిట్ల దండకం అందుకున్నారు. కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ ఇదే విషయాన్నీ చెబుతున్నారు. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కు చైర్మన్ గా తనను చేస్తే ఆ కూటమిలో పార్టీల ఎన్నికల ఖర్చులను తాను భరిస్తానని కేసీఆర్ ఆఫర్ ఇచ్చినట్లు రాజ్ దీప్ చెప్పడం సంచలనం రేపుతోంది.
దేశ రాజకీయాలపై రాజ్ దీప్ ఓ వీడియో చేశారు. అందులో కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల గురించి వివరంగా ప్రస్తావించారు. ఆయన వ్యూహాలు ఏంటో చెప్పారు. కేసీఆర్ ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి ఆఫర్ లు చేస్తున్నారో సవివరంగా చెప్పుకొచ్చారు. ఇప్పటికే తెలంగాణను దోచుకొని దేశ రాజకీయాల పేరుతో దుబారా ఖర్చులు పెడుతున్నాడని కేసీఆర్ పై ఆరోపణలు వస్తుండగా తాజాగా రాజ్ దీప్ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది.
కేసీఆర్ పలు ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల సమయంలో ఆర్ధిక సహాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో ఆప్ , జేడీఎస్ , వైసీపీ లాంటి పార్టీలకు ఫండింగ్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే కేసీఆర్ కు ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఎలా వచ్చిందని కేంద్ర ఏజెన్సీలు కూడా తెలుసుకుంటున్నట్లు సమాచారం.
ఏదీ ఎమైనా రాజ్ దీప్ సర్దేశాయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.