టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే. జల్సా సినిమా ద్వారా ఏర్పడిన వీరి పరిచయం అలాగే కొనసాగుతోంది. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఏ స్నేహాలు ఎక్కువ కాలం కొనసాగవు కానీ పవన్ – త్రివిక్రమ్ ల స్నేహం మాత్రం ఎలాంటి మనస్పర్ధలు లేకుండా కొనసాగుతోంది.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నా పవన్ సినిమా పనులన్నీ త్రివిక్రమ్ పర్యవేక్షిస్తున్నారు. స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు, హీరోయిన్స్ ఎంపిక మొదలుకొని పవన్ స్టార్ చేసే సినిమా వ్యవహారాలన్నీ త్రివిక్రమే చూసుకుంటున్నారు. ఇలాంటి స్నేహితుడిని బహుశా మనం నిజ జీవితం లో కూడా చూసి ఉండము.
కాగా ఇటీవల త్రివిక్రమ్ భార్య సౌజన్య ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పవన్ – త్రివిక్రమ్ ల స్నేహం గురించి చాలా గొప్పగా చెప్పింది. పవన్ మా ఇంటికి వచ్చినప్పుడల్లా త్రివిక్రమ్ గారితో మాట, ముచ్చట్లోనే మునిగిపోతారు. ఫిలాసఫీ మరియు పురాణల గురించి చర్చిస్తూ ఈ ప్రపంచాన్ని మరిచిపోతారని చెప్పుకొచ్చింది.
తన సొంత పుస్తకాలను ఎవరికీ ఇవ్వని త్రివిక్రమ్ శ్రీనివాస్, కళ్యాణ్ గారికి మాత్రం ఇస్తుంటారని సీక్రెట్ ను బయటపెట్టింది. వాళ్ళిద్దరి మధ్య తరుచు పుస్తకాల బదలాయింపు జరుగుతుందని వారికి పుస్తకాలపైనున్న ప్రేమను తెలియజేసింది. పవన్ కళ్యాణ్ మా ఇంటికి వచ్చినప్పుడు ఏమాత్రం సిగ్గుపడడని మాలో ఒకడిగా కలిసిపోతాడని చెప్పుకొచ్చింది.
నేను తయారు చేసే ఉప్మా అంటే ఆయనకీ ఎంతో ఇష్టమని మా ఇంటికి వచ్చినప్పుడల్లా అడిగి మరి చేయించుకొని తింటాడని తెలిపింది సౌజన్య.