ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఈడీ విచారణకు వెళ్ళే సమయంలో ఫోన్లను కవిత మీడియా ఎదుట ప్రదర్శించి తన పాత్ర లిక్కర్ స్కామ్ లో లేదని చెప్పాలనుకున్నారు. కానీ కవిత చేసిన ఈ ప్రయత్నమే ఆమెను రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయేట్లుగా చేసింది.
లిక్కర్ స్కామ్ లో ఆధారాలు దొరకకుండా ఉండేందుకు కవిత ఫోన్లను ధ్వంసం చేసిందని ఈడీ ఆరోపించింది. దాంతో ఆమె ఆ ఫోన్లు ఇవిగో అంటూ మీడియాకు చూపించి అనంతరం ఈడీ విచారణకు వెళ్ళింది. దాంతో కవితను కావాలనే దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేశాయని బీఆర్ఎస్ వాదించడం స్టార్ట్ చేసింది. కానీ కవిత మీడియా ముందు ప్రదర్శించిన ఫోన్లె ఆమెను బుక్ చేశాయి.
కవితకు లిక్కర్ స్కామ్ లో ప్రమేయం ఉందని…ఆమె ఫోన్లను ధ్వంసం చేసిందని అందుకు సంబంధించిన వివరాలను మీడియాకు లీక్ చేసింది. అందులో ఆమె వాడిన ఫోన్ నెంబర్లు, ఐఎంఐ నెంబర్లతో సహా పొందుపరిచింది. ఆ తరువాత కవిత మీడియా ముందు ప్రదర్శించిన ఫోన్ల ఐఎంఐ నెంబర్లు , ఈడీ మీడియాకు లీక్ చేసిన ఫోన్ల ఐఎంఐ నెంబర్లను పరిశీలిస్తే వేర్వేరుగా ఉన్నాయి. దాంతో కవిత ఈడీని తప్పుదోవ పట్టించాలని చూసినట్లుగా అర్థం అవుతోంది.
నిజానికి లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి అన్ని ఫోన్ల ద్వారానే జరిగాయని.. ఈ వివరాలు బయటపడకుండా ఉండేందుకు ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ ప్రధానంగా ఆరోపిస్తోంది. అసలు లిక్కర్ స్కామ్ లో తనకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పిన కవిత ఆ తరువాత ఫోన్లను మీడియా ఎదుట ప్రదర్శించడం హాట్ టాపిక్ అయింది.
లిక్కర్ స్కామ్ విచారణపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేసి ఉండటంతో విచారణ కాస్త నెమ్మదించింది. అదే సమయంలో కవిత సమర్పించిన ఫోన్లలో డేటా రికవరీ చేస్తూ ఈడీ అధికారులు మరోవైపు నరుక్కుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి తాను బీఆర్ఎస్ నేతలకు ఆప్ తరుఫున 75కోట్ల రూపాయలు ఇచ్చినట్లు చెప్పడం సంచలనం రేకెత్తిస్తోంది.
ఈ ముడుపులు ఎవరికి అందాయన్న కోణంలో కూడా ఈడీ విచారణ జరపనుందని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ముడుపులు కవితకు అందినట్లుగా తేలితే ఈ కేసు నుంచి కవితను కాపాడటం ఎవరితరం కాదనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ నగదును లిక్కర్ స్కామ్ లో నిందితుడిగానున్న రామచంద్ర పిళ్ళై ద్వారా ఇచ్చినట్లు సుఖేష్ చంద్రశేఖర్ చెప్పడంతో కవితని తదుపరి విచారణలో ఈ విషయమై ఈడీ ప్రశ్నించే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read : పట్టువదలని విక్రమార్కుడిలా రేవంత్ – కవిత, కేటీఆర్ లకు సిట్ నోటిసులు..!?