వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రాజకీయ వ్యవహారాల్లో చక్రం తిప్పిన కేవీపీ అందరికీ గుర్తుండే ఉంటారు. వైఎస్సార్ మరణం తరువాత ఆయన జగన్ కు చేదోడువాదోడుగా ఉంటారని అంత నమ్మారు కాని, కేవీపీ కాంగ్రెస్ తోనే కలిసి సాగారు. ఆ పార్టీలోనే ఇప్పటికీ కొనసాగుతున్నారు. జగన్ తో కేవీపీకి సత్సంబంధాలు ఉన్నప్పటికీ ఆయన జగన్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నించలేదు. మధ్యలో జగన్ కు రాజకీయ సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు కానీ వాటిని జగన్ రిసీవ్ చేసుకోకపోవడంతో కేవీపీ సైలెంట్ అయిపోయారు.
ఇటీవల కాలంలో జగన్ కు వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నారు కేవీపీ. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దివాళా తీయిస్తున్నారని… పోలవరాన్ని ప్రాధాన్యత అంశంలో లేకుండా చేశారని జగన్ పై విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలోనూ దోపిడీ జరుగుతోందని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొద్ది రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు కేవీపీ.
కేవీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని ప్రకటిస్తే అందరిలోనూ ఓ తరహ ఆసక్తి ఉండేది కాదు. ఈసారి మాత్రం ఆయన ప్రెస్ మీట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే..వైఎస్ కు చాలా దగ్గరగా ఆత్మీయంగా ఉన్న తాను జగన్ కు ఎందుకు దగ్గర కాలేకపోయానని చెప్పేందుకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పడంతో అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. కేవీపీ ఏర్పాటు చేయబోయే మీడియా సమావేశం జగన్ కు నెగిటివ్ గానే ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కేవీపీని జగన్ ఎందుకు దూరం పెట్టారో వైసీపీ నేతలకూ ఓ క్లారిటీ లేదు. వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన రోజున ఆయనతోపాటు ఆఫీసర్లు మాత్రమే వెళ్ళి కేవీపీ మరియు సూరీడు ఎందుకు వెళ్ళలేదనేది జగన్ అనుమానంగా పెట్టుకున్నారు. అయితే.. వైఎస్ జిల్లాల పర్యటనకు కేవీపీ ఎప్పుడు వెళ్ళలేదు.. ఇక సూరీడు మాత్రం హెలికాప్టర్ లో ప్లేసు లేక వెళ్లలేదని వైఎస్సార్ తో సన్నిహితంగా ఉండే నేతలు చెప్పారు. అయినా జగన్ మాత్రం వీటిని నమ్మలేదని.. వారిపై అనుమానంతోనే కేవీపీ , సూరీడులను పక్కన పెట్టేశారని అంటున్నారు.
ఏదీ ఏమైనా త్వరలో కేవీపీ ఏర్పాటు చేయబోయే ప్రెస్ మీట్ అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
Also Read : జగన్ ముందు ఆ 100నియోజకవర్గాల టార్గెట్ ఉంచిన బీజేపీ