టీఎస్ పీస్సీలో మంత్రి కేటీఆర్ విచారణను ఎదుర్కోక తప్పదా..? పట్టువదలని విక్రమార్కుడిలా రేవంత్ చేస్తోన్న పోరాటంతో కేటీఆర్ చిక్కుల్లో పడటం ఖాయమేనా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
టీఎస్ పీస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదటి నుంచి వాదిస్తున్నారు. కానీ రేవంత్ వాదనలను మంత్రి కేటీఆర్ కొట్టిపారేస్తూ వచ్చారు. ఇద్దరు వ్యక్తులు చేసిన నేరాన్ని వ్యవస్థకు అంటడుతారా..? అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారాన్ని ఇద్దరిపై మాత్రమే నేట్టేసేందుకు మంత్రి ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. టీఎస్ పీస్సీ చైర్మన్ , సెక్రటరీ, సభ్యులను మొత్తం విచారిస్తే ప్రభుత్వ పెద్దల బాగోతం బయటకొస్తుందని ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిన నాటి నుంచే రేవంత్ చెప్తున్నారు. దీంతో ఈ విషయంలో రాజకీయపరమైన ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి , బండి సంజయ్ లకు నోటిసులు ఇచ్చిన సిట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను మాత్రం విచారణకు పిలవకపోవడం చర్చనీయాంశం అయింది.
ఈ క్రమంలోనే పేపర్ లీక్ పై తాజాగా ఈడీకి ఫిర్యాదు చేసిన అనంతరం రేవంత్ మాట్లాడుతూ…ప్రశ్నాపత్రాలు విదేశాలకు కూడా పంపించినట్లు సిట్ కూడా గుర్తించిందన్నారు. ఆర్ధిక లావాదేవీలు జరగడంతో ఈ విషయంలో ఈడీ జోక్యం చేసుకొని విచారణ చేయాలని కోరారు. అటు న్యాయస్థానాల్లో సీబీఐతో విచారణను కోరుతూ రేవంత్ ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంలో రేవంత్ చేస్తోన్న పోరాటంతో ప్రభుత్వ పెద్దల్లో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కేటీఆర్ కనుసన్నలో సిట్ పని చేస్తోందని రేవంత్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిట్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈడీకి రేవంత్ ఫిర్యాదు చేసిన రోజే టీఎస్ పీస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ , సభ్యుడు లింగారెడ్డికి సిట్ నోటిసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మనీలాండరింగ్ జరిగిందన్న రేవంత్ ఫిర్యాదుపై ఈడీ పేపర్ లీక్ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే ఈ ఘటన వెనక దాగిన పెద్ద తలకాయలకు తలనొప్పులు తప్పవు. అదే సమయంలో సిట్ విచారణపై ఈడీ నివేదిక కోరి సమీక్షించి… ఈడీ కూడా రంగంలోకి దిగితే ఎవరెవరి హస్తముందో తేలుతుందని పెద్ద తలకాయలు ఆందోళన చెందుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఈడీ జోక్యం చేసుకోకుండా ఉండేందుకు మరియు సీబీఐ విచారణ అవసరం లేదని చెప్పేందుకు సిట్ నిష్పాక్షపాత విచారణ జరుపుతుందని చెప్పేందుకుగాను సెక్రటరీ , సభ్యుడికి నోటిసులు ఇచ్చినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే టీఎస్ పీస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డికి కూడా సిట్ నోటిసులు ఇవ్వడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
రేవంత్ ఫిర్యాదు పై ఈడీ స్పందించి విచారణ చేస్తే తెలంగాణ సర్కార్ ఇరకాటంలో పడినట్లే. ఎందుకంటే ఈ విషయంలో రేవంత్ పలు సంచలన విషయాలను బయటపెడుతున్నారు. జగిత్యాల జిల్లాలో పరీక్ష రాసిన వారి సమాచారం కేటీఆర్‌కు ఎవరు అందించారని… కటాఫ్ మార్కుల గురించి పరీక్ష రాసిన అభ్యర్థులకే తెలియదు.. కేటీఆర్‌కు ఈ విషయాలు ఎలా తెలిశాయని నిలదీశారు. రేవంత్ లేవనెత్తిన ఈ అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. నిజంగా కేటీఆర్ కు ఈ సమాచారం ఎలా చేరి ఉంటుందని చర్చిస్తున్నారు. ఈ అంశాలను రేవంత్ బయటకు తీసుకోస్తుండటంతో కేటీఆర్ మరింత చిక్కులో పడటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
అదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా సిట్ నోటిసులు ఇస్తారా..? అనే చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే 2016లో జరిగిన గ్రూప్ 1 పరీక్షలో కవిత పదుల సంఖ్యలో ఆమె అనుచరులు క్వాలి ఫై అయ్యారని దీని వెనక కవిత హస్తం ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వ్యవహారంపై తాజాగా ఈడీ రేవంత్ ఫిర్యాదు చేయడంతో కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు సిట్ వ్యూహాత్మకంగా నోటిసులు ఇస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సిట్ రిపోర్ట్ ను హైకోర్టు కోరే అవకాశం ఉంది. అదే జరిగితే ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నేతలకు ఎందుకు నోటిసులు ఇచ్చి ప్రశ్నించలేదని సిట్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని సిట్ ప్లాన్ మార్చినట్లుగా చెబుతున్నారు.
Also Read : మలుపు తిరిగిన ఢిల్లీ లిక్కర్ స్కాం -మరోసారి ఊబిలో పడిన కవిత?