గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను బీజేపీ పూర్తిగా దూరం పెట్టాలనుకుంటుంది. ఆయనతో ఎగలేకపోతున్నామని నిర్ధారణకు వచ్చినట్లుంది. అందుకే ఆయనపై విధించిన సస్పెన్షన్ ను బీజేపీ ఇంకా ఎత్తివేయడం లేదు. సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరుతున్నా బీజేపీ నుంచి పాజిటివ్ రియాక్షన్ ఉండటం లేదు.
ప్రతి సమయంలోనూ రాజాసింగ్ చేసే వ్యాఖ్యల వలన బీజేపీపై అపవాదు నెలకొంటుందని ఆ పార్టీ అంచనాకు వస్తోంది. పార్టీ బలపడుతున్నా ఆయన చేసే వ్యాఖ్యల వలన తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆయనపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేస్తే కొని కష్టాలు తెచ్చుకోవడమేనని…అందుకే ఆయన పూర్తిగా వదులుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా రాజాసింగ్ పై బీజేపీ అధికారంలోనున్న మహారాష్ట్రలో కేసు నమోదు కావడం చర్చనీయాంశం అవుతోంది. రాజాసింగ్ ను పార్టీ లైట్ తీసుకోవడంతోనే ఆ పార్టీ పవర్ లోనున్న రాష్ట్రంలో కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. జనవరి 29న ముంబైలో ప్రసంగించిన రాజాసింగ్ తీవ్ర అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు.
దాదాపు 30 నిమిషాల పాటు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారు . ‘లవ్-జిహాద్’ గురించి కూడా మాట్లాడారు. మైనారిటీ కమ్యూనిటీ సభ్యులు నిర్వహించే షాపుల నుంచి ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయకూడదని ప్రతి హిందువును కోరుతున్నానని చెప్పుకొచ్చారు. రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించేలా లేదా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లుగా విమర్శలు రావడంతో పోలీసులు చివరికి కేసు పెట్టారు. రెండు నెలల తర్వాత కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఇలా ఎదో ఒక సమయంలో ఆయన చేసే వ్యాఖ్యల వలన పార్టీ ఇరకాటంలో పడుతుందని భావించే కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో మహ్మద్ ప్రవక్తపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన రాజాసింగ్ అరెస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యల కారణంగా ఆయన్ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇక రాజాసింగ్ ను ఎగలేమని నిర్ధారించుకున్నట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి.