శ్రీరామనవమి వేడుకలలో భాగంగా సీతారాములు కళ్యాణం వైభోగంగా, కన్నుల పండుగగా జరుగుతోంది. భక్తులు ఆదమరిచి కళ్యాణ మంత్రాలు వింటూ పులకిస్తున్నారు. ఒక్కసారిగా ఆహాకారాలు. మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో ఎవ్వరికి అర్థంకాని పరిస్థితి. ఆడవాళ్లు, మగవాళ్ళు ఆర్తనాదాలు చేస్తూ పరుగులు తీశారు. పిల్లలు, వృద్ధులు వాళ్ళ కాళ్ళ కింద పడి నలిగారు.
కళ్యాణం చేస్తున్న పూజారులు ముందుగా ఆ షాక్ లోంచి కోలుకుని మంటలను ఆర్పే పనిలో పడ్డారు. మరికొందరు యువకులు వాళ్లకు సహాయం చేసి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే జరగవలసి నష్టం జరిగింది. చలువ పందిళ్లు కాలి మసయ్యాయి. ఎవ్వరికి ప్రాణ నష్టం జరగకపోయినా కొందరికి కాళ్లు, చేతులు కాలాయి.
ఇలాంటి సీన్ ఆ మధ్య వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో మీరు చూసి ఉంటారు. మహేష్ బాబు, వెంకటేష్ ఆ మంటలను ఆర్పీ భక్తులను కాపాడతారు. ఆ సీన్ ఇప్పుడు నిజంగానే భక్తుల కళ్ళముందు జరిగింది.
పక్షిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలంలో ‘దువ్వ’ లోని వేణు గోపాలస్వామి ఆలయంలో ఈ రోజు ఉదయం ఈ అప
శృతి దొర్లింది. వెంటనే ఆలయ సిబ్బంది ఫైర్ ఇంజన్ కంటే ముందు పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. రంగంలోకి దిగిన పోలీసులు కూడా మంటలు ఆర్పడంలో సహాయం చేసి పరిస్థిని చక్కదిద్దారు.
భక్తుల కోసం వేసిన చలువ పందిళ్లు, పెళ్లి సామగ్రి, ఇతర వస్తువులు అన్ని కాలి బూడిదయ్యాయి. ఈ మంటలు షాక్ సర్కూట్ వల్ల జరిగాయా లేక ఆంజనేయుడు లంకను దహించినట్లు ఎవ్వరైనా కావాలని నిప్పు పెట్టారా? అనే కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు. ఈ ప్రాంతంలో రాజకీయ కక్షలు బాగానే ఉన్నాయి. కావున అన్ని కోణాల్లో కేసు పరిశోధించి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు భరోసా ఇచ్చారు. మొత్తానికి పండగ రోజు ఇలాంటి దారుణం జరగడం సోచనీయం.