మోడీపై రాజకీయ విమర్శ చేసిన కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ళ జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్ సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ గాంధీపై వేటు పడటంతో కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుందా.?అనేది బిగ్ డిబేట్ గా మారింది. తాజాగా కర్నాటక ఎన్నికలకు ఈసీ సిద్దం అవుతుండటంతో వయనాడ్ ఉప ఎన్నికకు కూడా నోటిఫికేషన్ ఇస్తారా అనే చర్చ జరుగుతోంది.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడటంతో వయనాడ్ స్థానం ఖాళీ అయినట్లుగా అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. దాంతో ఉప ఎన్నిక నిర్వహణపై తాజాగా భారత ఎన్నికల సంఘం స్పందించింది. ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంటుందా..? లేదా అనే అంశంపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఏదైనా ఖాళీ అయిన నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఆరు నెలల సమయం ఉంటుంది. కాబట్టి వయనాడ్ విషయంలో ఇప్పటికప్పుడు అత్యుత్సాహం చూపబోమని ఎన్నికల సంఘం పేర్కొంది. రాహుల్ గాంధీకి ట్రయల్ కోర్టు న్యాయపరమైన పరిష్కారానికి 30 రోజుల సమయం ఇచ్చింది. సో, రాహుల్ గాంధీ అనర్హత విషయంలో వేచి ఉంటామని సిఇసి రాజీవ్ కుమార్ తెలిపారు.
సూరత్ కోర్టు తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు రాహుల్ గాంధీకి నెల రోజుల సమయం ఇచ్చింది. ఆలోగా కోర్టు తీర్పుపై పైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటే ఉప ఎన్నికకు అవకాశం లేనట్టే. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని అప్పటివరకు వేచిచూస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
అయితే, బుధవారం లక్షద్వీప్ ఎంపి మహమ్మద్ ఫైజల్ పై హైకోర్టు ఆదేశాల మేరకు పార్లమెంట్ అనర్హత వేటును తొలగిస్తూ లోక సభ సెక్రటరీ కొత్త నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇది రాహుల్ గాంధీ విషయంలో కూడా వర్తిస్తే ఇక ఎన్నికల గొడవే ఉండదు.
Also Read : రాహుల్ గాంధీ లాగా గతంలో అనర్హత వేటుకు గురైన నేతలెవరో తెలుసా..? కానీ