జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తనదైన కామెడి టైమింగ్ తో చాలా తక్కువ కాలంలో స్టార్ కమెడియన్ కు ఎదిగాడు. హైపర్ ఆదితో సమానమైన క్రేజ్ తెచ్చుకున్నాడు ఇమ్మాన్యుయేల్. తను చేసిన స్కిట్స్ ను ఆదరణ భారీగా ఉండటంతో స్పెషల్ ఈవెంట్స్ కు ఇమ్మాన్యుయేల్ ను యాంకర్ గా ఇన్వైట్ చేస్తున్నారు.
జబర్దస్త్ ద్వారా క్రేజ్ సంపాదించుకున్న ఇమ్మాన్యుయేల్ తాజాగా ఓ స్కిట్ చేసి దెబ్బలు తిన్నాడు. కారణం రాజకీయపరమైన స్కిట్లు. ఎమ్మెల్యేను అనుకరిస్తూ స్కిట్స్ చేసి నవ్వించాడు. కానీ ఇది ఎమ్మెల్యే అనుచరులకు నచ్చలేదు. ఇంకేముంది ఇమ్మాన్యుయేల్ పై దాడి చేసి గాయపరిచారు. మరోవైపు సోషల్ మీడియాలో ఇమ్మాన్యుయేల్ ను లక్ష్యంగా చేసుకొని ట్రోల్ చేస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే… ఇమ్మాన్యుయేల్ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని అనుకరిస్తూ ఓ స్కిట్ చేశారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి ఎలాగైతే ప్రవర్తిస్తారో అచ్చం అలాగే ఇమ్మాన్యుయేల్ చేశాడు. ఏంట్రా అంత లావు అయ్యావని కేతిరెడ్డి ఓ స్కూల్ స్టూడెంట్ ను అడిగిన వీడియో ఎంత వైరల్ అయిందో తెలుసు కదా. దాని ఆధారంగా ఇమ్మాన్యుయేల్ ఓ స్కిట్ చేశాడు.
ఇందులో స్కూల్ పిల్లాడిగా బాబును పెట్టాడు. దీంతో బాబును ఇమ్మాన్యుయేల్ అచ్చం ఎమ్మెల్యేలాగే కొట్టడంతో అక్కడున్న వాళ్ళంతా గొల్లున నవ్వుతున్నారు. చివర్లో ఇమ్మాన్యుయేల్ అతిని చూసి మూకుమ్మడిగా దాడి చేస్తారు.
దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ వచ్చే శుక్రవారం ప్రసారం కానుంది.
ఈ వీడియోపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వర్గం గుర్రుతో ఉంది. ఎమ్మెల్యే ప్రజా కార్యక్రమాలు చేపడితే మీకు కామెడీగా ఉందా? అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కొందరు ఇమ్మాన్యుయేల్ ను హెచ్చరించేవిధంగా కామెంట్లు చేస్తున్నారు.
Also Read : పెళ్లయ్యాక అవసరం తీరిపోయింది – హీరో నిఖిల్ పై భార్య షాకింగ్ కామెంట్స్