తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పురుడుపోసుకున్న టీడీపీ ఇప్పుడు 41వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఓ ప్రాంతీయ పార్టీ నాలుగు దశాబ్దాలుగా రాజకీయ మనగడలో ఉండటం విశేషమే. ఈ నలభై ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన టీడీపీని మింగేయాలనే ప్రయత్నాలు జరిగాయి. కానీ వాటన్నింటిని ఎదుర్కొని తెలుగు ప్రజల అభిమానంతో ఇంకా సజీవంగా… సగర్వంగా నిలబడింది తెలుగు దేశం పార్టీ.
తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతోన్న నేపథ్యంలో టీడీపీపై ఆంధ్ర పార్టీ అనే ముద్ర వేశారు. ఆ సమయంలో టి. టీడీపీ నాయకులు కొంతమంది పార్టీని వీడారు. కానీ కీలక నేతలెవరూ పార్టీ జెండాను వదలలేదు. బడుగు, బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించిన టీడీపీతో అనుబంధాన్ని తెంచుకోవడమంటే పేగు బంధాన్ని తెంచుకోవడమని భావించి పార్టీలోనే కొనసాగారు. అందుకే రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణలో టీడీపీపై కేసీఆర్ మొదటి కుట్ర స్టార్ట్ అయింది. ఆ పార్టీ దుకాణం తెలంగాణలో బంద్ చేయలనుకున్నారు కేసీఆర్. ఈ క్రమంలోనే కోవర్ట్ ల సహాయంతో తెలంగాణలో టీడీపీని బలహీనపరిచారు. నాయకులు పార్టీని వీడారు కానీ కార్యకర్తలు మాత్రం టీడీపీ జెండా వదిలేది లేదని ప్రతినబూనుతున్నారు. ఆ కార్యకర్తల కమిట్మెంట్ తో టీడీపీ ఇప్పుడు తెలంగాణలో బలీయమైన రాజకీయ శక్తిగా ఎదుగుతోంది.
ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ దారుణమైన పరాజయం చవిచూడటంతో ఏపీలోనూ ఆ పార్టీ కోలుకోవడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మళ్ళీ అధికారంలోకి రావడం అసాధ్యమని రాజకీయ మేధావుల విశ్లేషణలను తెరమరగు చేస్తూ టీడీపీ అధికారం దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీని మట్టికరిపించి సైకిల్ స్పీడ్ లో ఫ్యాన్ పంకలను పటా-పంచలు చేసింది. ఈ ఉత్సాహమే టీడీపీని మరోసారి అధికారంలోకి వచ్చేందుకు దోహదం చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబే కాదు ఎన్టీఆర్ కూడా పార్టీని ప్రారంభించిన తరువాత ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాక కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయాలు చేసి.. నాదెండ్ల భాస్కర్ రావు దెబ్బకు అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అప్పుడు అన్నగారి పనైపోయింది. ఆయన మళ్ళీ సినిమాలు చేసుకోవడం మంచిదనే సెటైర్లు పేలాయి. ఓటములను ఎదుర్కొని వాటి నుంచి గుణపాఠాలను నేర్చుకొని… ప్రజల అభిమానాన్ని చొరగొని అధికారంలోకి పార్టీని తీసుకొచ్చి తనేంటో, తెలుగు వాడి పవర్ ఏంటో ఢిల్లీ పెద్దలకు రుచి చూపించాడు.
ఇప్పుడు చంద్రబాబు కూడా 2019ఎన్నికల ఓటమికి గుణపాఠాలను నేర్చుకొని వ్యూహాత్మక ఎత్తుగడలతో సాగుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను చాటింపు వేస్తూ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తూ టీడీపీ అధికారంలోకి రావాల్సిన అనివార్యతను గుర్తు చేసుకున్నారు. దోపిడీ పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి లోకేష్ ను కూడా రంగంలోకి దించారు. తను కూడా 4వేల కిలోమీటర్ల సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టారు. ఏపీ రాజకీయ చరిత్రలో ఈ పాదయాత్ర ఓ మైలురాయిగా నిలుస్తుంది.
తాను పెట్టిన పార్టీ తనతోనే అంతమవుతుందని అప్పట్లో ఎన్టీఆర్ అన్నారు కానీ.. టీడీపీ ఇప్పటికీ గట్టిగా నిలబడి పోరాడుతూనే మధ్యలో టీడీపీ పదేళ్లు అధికారానికి దూరమయింది. కాని మళ్ళీ విజయాన్ని అందుకొని ప్రజల ఆదరణను చూరగొన్నది. ఇదే ఊపుతో పార్టీని మరింత కాలం నిలబెట్టి తెలుగు ప్రజలు ఉన్నంతకాలం టీడీపీని సుస్థిరం చేసే పనిలో ఆ పార్టీ ప్రయాణం కొనసాగుతుంది. ది గ్రేట్ జర్నీ టీడీపీ వారియర్స్.
Also Read : తెలంగాణపై చంద్రబాబు ఫోకస్ – జూ. ఎన్టీఆర్ కు కీలక బాధ్యతలు..?