యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ ( యూపీఐ) లావాదేవీలపై కేంద్రం చార్జీలను విధించే యోచనలో ఉందన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ ప్రచారం ట్రెండ్ అవుతోంది. దేశ ప్రజలకు శ్రీరామనవమి సందర్భంగా కేంద్రం అందిస్తోన్న కానుక ఇదేనంటూ విస్తృత ప్రచారం జరుగుతోంది.
యూపీఐ ద్వారా నిర్వహించబడే వ్యాపార లావాదేవీలకు ప్రీ పెయిడ్ చార్జీలను అమలులోకి తీసుకురానుందనే వార్తతో కూడిన ఫోటో ఒకటి చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం చూస్తే.. యూపీఐ ద్వారా నిర్వహించే లావాదేవీలపై 1.1శాతం చార్జీలను వసూలు చేసుకునే వీలుగా నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన సర్క్యూలర్ లో పేర్కొంది.
ఏప్రిల్ ఒకటి నుంచి యూపీఐలో రూ. 2వేల కంటే ఎక్కువ లావాదేవీలపై 1.1పీపీఐ చార్జీలను వర్తింపజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు చేసి ఆ సమయంలో డిజిటల్ పేమెంట్స్ అని చెప్పి..ఆన్ లైన్ లావాదేవీలకు అలవాటు చేసి ఇప్పుడు అదే డిజిటల్ పేమెంట్స్ పై చార్జీలను వసూళ్లు చేస్తారా..? ఇంతకన్నా మోసం ఎక్కడైనా ఉంటుందా మోసకారి మోడీ ..? విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read : తెలంగాణపై చంద్రబాబు ఫోకస్ – జూ. ఎన్టీఆర్ కు కీలక బాధ్యతలు..?