బిఆర్ఎస్ ఎమ్మెల్లేల భాగోతాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటివరకు నవ్య ను వేధించిన రాజయ్య కేసు మరువకముందే ఇప్పడు మరో కీచకకుడి కథ వెలుగులోకి వచ్చింది. అతను ఎవరో కాదు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్లే దుర్గం చిన్నయ్యపై ‘ఆరిజన్ డెయిరీ సంస్థ’ సీఈవో బోడపాటి శైలజ సంచలన ఆరోపణలు చేశారు. ఆమెకు రాజకీయాలతో సంబంధం లేదు. వ్యాపారి.
డెయిరీ పని అనుమతులకోసం ఆమె కలిసినప్పుడు దుర్గం చిన్నయ్య తన కామకేళి గురించి చెప్పాడు. ఆమెను గోకాలని చూసినట్లు ఆమె స్చెవయంగా చెప్పింది. తాను అలాంటిదానిని కాదని, కావాలనుంటే ‘అలాంటి’ అమ్మాయిలను సప్లయి చేస్తానని ఆమె ఒప్పుకున్నట్లు స్వయంగా చెప్పింది. స్త్రీ లోలుడైన అతను ఒప్పుకున్నాడు.
అక్కడినుంచి ఆమె అమ్మాయిను సరఫరా చేస్తూ తన పనులు చేయించుకుంది. అతను హైదరాబాద్ లోని ఎంఎల్ఏ కాలానికి వచ్చిన ప్రతిసారి అమ్మాయిలను పంపేదని చెప్పింది. కొన్ని పనులను, కొన్ని పనుల అనుమతులకు డబ్బులు కూడా తీసుకున్నాడు అని ఆమె ఆరోపించింది. కానీ ఆ పనులు చేయలేదు.
ఆ తర్వాత దళితబంధు కోసం దుర్గం చిన్నయ్యను ఎప్పటిలా శైలజ కలిసింది. ఆమె అందం మీద మొదటినుంచి కన్నేసిన అతను ‘ఈసారి నువ్వే కావాలి, నువ్వు పంపే అమ్మయిలు అందంగా లేదని’ వేధించడం మొదలు పెట్టినట్లు ఆమె చెప్పింది. ఈసారి అతను బేరానికి దిగి తన కోరిక తీరిస్తేనే ఆమె పనులు చేస్తానని మందలించాడు. దానితో ఆమె జాగ్రత్తపడి అతని ప్రతి కదలికను రికార్డ్ చేసింది. అతని ఫోన్ కాళ్ళు రికార్డ్ చేయడం మొదలుపెట్టిందేసి. అతనిని బ్రోతల్ కేసులో ఇరికించాలని స్కెచ్ గిసింది.
ఇది తెలిసి దుర్గం చిన్నయ్య ఖంగు తిన్నాడు. ఆమె తనను బ్రోతల్ కేసులో ఇరికించడానికి ముందే ఆమెనే రివర్స్ లో ఇరికించాలని స్కెచ్ గీశాడు. అందుకే ఆమెకు ఫోన్ చేసి దళితబంధు విషయం మాట్లాడాలంటూ బెల్లంపల్లిలోని ఇంటికి రావాలన్నారు ప్రేమతో పిలిపించాడు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళింది. కొద్దిసేపటికి పోలీసులను పిలిచారు. బ్రోతల్ కేసులో ఆమెను ఇరికించాడు. ”మమ్మల్ని అక్రమంగా మూడు రోజులు బంధించారు. అంతకు ముందు రికార్డ్ చేసిన వీడియోలు, ఆడియోలు ఇవ్వాలని బెదిరిస్తూ స్టేషన్లో టార్చర్ చూపించారు” అని ఆమె ఆరోపించారు.
ఆమె అతని అక్రమాలు బయటపెడుతూ ”మాపై తప్పుడు కేసులు బనాయించి నాలుగో రోజు ఆదిలాబాద్ జిల్లా జైలుకు రిమాండ్కు తరలించారు. 20 రోజుల తర్వాత కండీషన్ బెయిల్పై బయటకొచ్చాం. ప్రతి శని, ఆదివారాల్లో బెల్లంపల్లి టూ టౌన్ పోలీ్సస్టేషన్లో మేం హాజరు కావలసి వస్తోంది” అని శైలజ ఆవేదన వెళ్లగక్కింది.
ఇప్పడు అతని రాసలీల ఆడియో, వీడియోలను ఆమె ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. ఎవరిని ఎవరు వాడుకున్నారు, ఎవరు ఎత్తువేసారు, ఎవరు పై ఎత్తు వేశారో ముందుముందు తెలుస్తుంది.