నాగచైతన్య – సమంత విడిపోయి ఏడాదిన్నర అవుతోంది. అప్పటి నుంచి వీరి పెళ్లి వార్తలపై పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. పలానా హీరోయిన్ తో నాగ చైతన్య డేటింగ్ లో ఉన్నాడని…అలాగే సమంత కూడా ఓ హీరోతో రిలేషన్ లో ఉందని ఎప్పటికప్పుడు కొత్త, కొత్త వార్తలు వస్తున్నాయి. కానీ వీటిపై అధికారిక ప్రకటన రాలేదు.
విడాకులు తీసుకున్న నాగ చైతన్య- సమంతలు రిస్క్ చేశారనే చెప్పాలి. ఎందుకంటే వారు వెంటనే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి. ఆలస్యం చేస్తే వయస్సు పైబడుతుంది. పిల్లల్ని కనాలన్న, వారి బాధ్యతలను చూసుకోవాలన్న సరైన సమయంలో పెళ్లి చేసుకుంటేనే సాధ్యం అవుతుంది. 35ఏళ్ల వయస్సులో నాగచైతన్య – సమంత విడిపోవడంతో భవిష్యత్ దృష్ట్యా వెంటనే పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి.
వీరి విడాకుల ప్రకటన తరువాత రెండో పెళ్లి వార్తపై ఎప్పటికప్పుడు , సరికొత్తగా వార్తలొచ్చాయి. నటి శోభిత ధూళిపాళ్ళతో చైతూ ప్రేమాయణం కొనసాగిస్తున్నారని ప్రచారం జరగగా…సమంత కూడా కుటుంబ సభ్యులు, స్నేహితుల ఒత్తిళ్ళ మేరకు రెండో పెళ్లి చేసుకోనుందని ప్రచారం జరిగింది. అయితే శోభితతో ప్రేమాయణం వార్తలను నాగచైతన్య ఖండించారు. ఎవరో కావాలనే చేస్తోన్న ప్రచారమేనని చెప్పడంతో ఈ కథనాలకు ఫుల్ స్టాప్ పడింది.
తాజాగా శోభితతో నాగ చైతన్య ప్రేమాయణం నిజమేనని చెప్పేందుకు ఓ ఆధారం లభ్యమైందని ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ లోని ఓ రెస్టారెంట్ కి చైతు -శోభితలు కలిసి వెళ్లారు. ఆ హోటల్ నుంచి బయటకొచ్చే సమయంలో చెఫ్ చైతుతో ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. ఆ ఫొటోలో అనుకోకుండా శోభిత కూడా పడింది. దీంతో మరోసారి చైతు- శోభిత ప్రేమాయణం అనే వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఇటీవల కొత్త ఇంటి నిర్మాణం పూర్తి చేసిన నాగ చైతన్య గృహ ప్రవేశం కూడా కానిచ్చేశారు. పెళ్లి కోసమే కొత్త ఇంటి నిర్మాణం జరిగి ఉంటుందని తాజాగా బయటకొచ్చిన ఫోటోను చూసి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్య తోడు వెతుకున్నాడని, ఇక సమంత వంతు అంటున్నారు. ఆమె కూడా నచ్చిన వాడిని ఎంచుకుని పెళ్లి పీటలు ఎక్కితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.