ఏపీలో టీడీపీ స్ట్రాంగ్ అవుతోంది. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి షాక్ ఇచ్చి టీడీపీ విజయబావుటా ఎగరేసింది. ఈ తీర్పుతో ఏపీలో అధికారంలోకి రానున్నది సైకిల్ పార్టీనేనని ఆ పార్టీ నేతలతోపాటు క్యాడర్ కు ఓ నమ్మకమైతే కల్గింది. దీంతో చంద్రబాబు ఏపీతోపాటు తెలంగాణలోనూ పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయాలని చూస్తున్నారు. ఇంతకాలం ఏపీపై మాత్రమే పూర్తి ఫోకస్ చేసిన చంద్రబాబు ఇటీవలి ఫలితంతో తెలంగాణకు కూడా కొంత సమయం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో టీడీపీని ప్రక్షాళన చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలంటే ఏం చేయాలన్న దానిపై సమాలోచనలు జరుపుతున్నారు. ఏం చేస్తే పార్టీ బలపడుతుంది..? పార్టీలోకి చేరికలను ముమ్మరం చేయాలంటే ఎలాంటి రూట్ మ్యాప్ రూపొందించుకోవాలి..? అనే అంశాలపై చంద్రబాబు టీడీపీ నేతలతో చర్చిస్తున్నారు.
తెలంగాణ టీడీపీ అద్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ను నియమించాక పార్టీలో కొంత కొత్త ఊపు వచ్చిందనేది ఓపెన్ సీక్రెట్. ఆయనకు మరికొంతమంది నేతల సహకారం అందితే పార్టీని ఓ స్థాయిలోకి తీసుకోస్తారని చంద్రబాబు పూర్తిగా విశ్వసిస్తున్నారు. ఇందుకోసం చంద్రబాబు సంచలన కీలక నిర్ణయం తీసుకోనున్నారని ఆ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏపీలో పార్టీ గాడిన పడుతుండటం.. లోకేష్ పాదయాత్రకు భారీ ఆదరణ ఉండటంతో చంద్రబాబు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే…టీడీపీలో చంద్రబాబు తరువాత లోకేష్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లోకేష్ కు పార్టీలో పట్టు సంపాదించాక చంద్రబాబు తప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఎన్టీఆర్ పరిస్థితి ఏంటని నందమూరి అభిమానుల నుంచి వస్తోన్న ప్రశ్న. అందుకే చంద్రబాబు చాలా తెలివైన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఏపీ రాజకీయాలను లోకేష్ కు అప్పగించి…ఎన్టీఆర్ కు ఆసక్తి ఉంటె తెలంగాణ రాజకీయలను ఆయనకు అప్పగించాలనే తలంపుతో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. ఇలా చేయడం వలన నారా – నందమూరి కుటుంబాల మధ్య రాజకీయ వైరుధ్యాలు పూర్తిగా తొలగిపోతాయనే నమ్మకంతో చంద్రబాబు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరికొద్ది రోజుల్లో ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వస్తారని హీరో నారా రోహిత్ ఇటీవల లోకేష్ పాదయాత్రలో పాల్గొని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కు తెలంగాణ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరగడం చూస్తుంటే తెలంగాణలో పార్టీ వ్యవహారాలను ఎన్టీఆర్ కు అప్పగిస్తారనే ప్రచారానికి బలం చేకూరుతోంది.
తొందర్లోనే ఎన్టీఆర్ తో చంద్రబాబు భేటీ అయి.. ఈ అంశంపై ఆయనతో చర్చించనున్నారని అంటున్నారు. చంద్రబాబు నిర్ణయంపై ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
Also Read : ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి బాగోతం బయటపెట్టిన శ్రీరెడ్డి