ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచుతోంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మూడుసార్లు విచారించిన ఈడీ తాజాగా మరోసారి నోటిసులు జారీ చేసింది. మంగళవారం ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటిసులో పేర్కొన్నారు. అయితే ఈసారి విచారణకు మీరు కాని మీ తరుఫున ప్రతినిధిని పంపవచ్చునని మినహాయింపు ఇచ్చింది ఈడీ.
ఇటీవల విచారణకు హాజరైన కవిత ఈడీకి తాను వాడిన సెల్ ఫోన్లను అందజేసింది. ఆమె అందించిన ఈ మొబైల్ ఫోన్లను ఇప్పుడు ఓపెన్ చేసేందుకు సిద్దమైంది ఈడీ. దాంతో ఆమె సమక్షంలోనే ఈ ఫోన్లను ఓపెన్ చేయాలనుకొని కవితకు ఈడీ నోటిసులు ఇచ్చింది. మీరైనా రావొచ్చు, మీ ప్రతినిధినైనా పంపవచ్చునని నోటిసులో పేర్కొనడంతో ఈడీ కార్యాలయానికి కవిత తరుఫున బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ వెళ్లనున్నారు.
కవిత వ్యక్తిగత మొబైల్‌ను మొదటిసారి విచారణకు వెళ్లినప్పుడే ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె బ్యాంక్ స్టేట్మెంట్, బిజినెస్‌కు సంబంధించిన కీలక పత్రాలను తన న్యాయవాది సోమా భరత్ ద్వారా ఈడీకి పంపారు. తరువాత రెండోరోజు కవిత విచారణకు హాజరైన క్రమంలో కొన్ని మొబైల్ ఫోన్స్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈడీ ఎదుట హాజరయ్యే ముందు మొబైల్ ఫోన్లను సీల్డ్ కవర్లో మీడియాకు చూపించారు.
తాజాగా కవిత ఈడీకి అందజేసిన ఫోన్ల ఆధారంగా ఈడీ విచారణలో ముందుకు వెళ్ళలనుట్లు తెలుస్తోంది.
Also Read : లిక్కర్ స్కామ్ లో నాలుగోసారి విచారణకు కవిత – జరిగేది ఇదేనా..?