కాంగ్రెస్ పార్టీ మహావృక్షాన్ని ఎక్కడికక్కడా ముక్కలు ముక్కలుగా నరకాలని బిజెపి కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఆ దిశగా తప్పటడుగులు వేస్తూ మునుపెన్నడూ కనీవిని ఎరుగని రీతిలో కుటిల రాజకీయాలకు కొత్తగా తెరలేపింది అని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. అందులో భాగంగా చివరికి తండ్రి – కొడుకు, అన్నా – తమ్ముడు అనే బేధాలు కూడా లేకుండా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోంది. గత నాలుగు రోజులుగా ఈ పరిణామాలు దీనిని రుజువుచేస్తున్నాయి.
రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించినప్పటినుంచి కాంగ్రెస్లో ఒక్కసారిగా చైతన్యం వచ్చింది. అనారోగ్యంతో మంచం పట్టిన సీనియర్ నేతలు కూడా మళ్ళి రంగంలోకి దిగుతున్నారు. అందులో భాగంగా మాజీ పిసిసి ప్రెసిడెంట్, రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ చాలా కాలం తర్వాత తిరిగి కాంగ్రెస్ లో చేరారు. కాటికి కాళ్ళు చాపిన ఆయనను నలుగురు తీసుకొచ్చారు అందం కంటే మోసుకొచ్చారు అంటే బాగుంటుంది. ఆయనకు కాంగ్రెస్ మీద ఉన్న ప్రేమ, గౌరవం అది.
”నేను చచ్చినా పర్వాలేదు – కానీ నా కాంగ్రెస్ పార్టీ చావకూడదు. నా కోన ఊపిరి ఉన్నతకాలం కాంగ్రెస్ కే సేవచేస్తాను. నేను చచ్చిపోయినా నా శవం మీద కాంగ్రెస్ జెండా పరచాలి” అని డి. శ్రీనివాస్ చెప్పారు. అది ఒక కాంగ్రెస్ నేత కమిట్ మెంట్.
ఈ మాటలు, చేష్టలు బిజెపి అధిష్టానానికి నచ్చలేదు. ఇలాంటి సీనియర్లు తిరిగి పార్టీ లోకి వస్తే కాంగ్రెస్ బలం పుంజుకుంటుంది అని భయపడింది. అందుకే తమ ఎంపి ధర్మపురి అరవింద్ ని వెంటనే రంగంలోకి దింపింది. తండ్రి అని చూడకుండా ఆ ముసలోడి చేత వెంటనే కాంగ్రెస్ కు రాజీనామా చేయించు, ఇక్కడ సెంటిమెంట్లు ఉండవు. గెలుపే మనకు ముఖ్యం అని ఆదేశించినట్లు తెలిసింది.
అందుకే అరవింద్ తన తండ్రి అని చూడకుండా, అనారోగ్యంతో ఉన్నాడని కనికరించాకుడా తిట్టినట్లు శ్రీనివాస్ పెద్ద కొడుకు డి. సంజయ్ ఆవేదన వ్యక్తం చేసారు. చివరికి ఆ పెద్దాయనను బెదిరించి అరవింద్ వెంటనే రాజీనామా చేయించాడు అని సొంత అన్నయ్య సంజయ్ ఆరోపించారు.
అంతేకాదు, రాజీనామా చేసిన తర్వాత శ్రీనివాస్ మీడియా ముందు తన ఆవేదన చెప్పుకోకుండా అరవింద్ కావాలని అండర్ గ్రౌండ్ లో దాచాడు అని కాంగ్రెస్ నాయకుడు ధర్మపురి సంజయ్ ఆరోపించారు. ఇప్పడు డి. శ్రీనివాస్ ఫోన్ పని చేయడం లేదు. ఎక్కడున్నారో అరవింద్ కు మినహా కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. మరి రాజకీయం కోసం ఇంతగా దిగజారాలా అని జనం షాక్ అవుతున్నారు. ఇక డి. శ్రీనివాస్ అనారోగ్యం కంటే ముందే అరవింద్ పెట్టే హిసంకే గుండె పగిలి చచ్చేలా ఉన్నాడు అని కాంగ్రెస్ నాయకులు బాధపడుతున్నారు. ఏ తల్లి కూడా అరవింద్ లాంటి కొడుకుని కనకూడదు అని శ్రీనివాస్ భార్య విజయ లక్ష్మీ కన్నిరుమున్నిరు అవుతున్నారు.