తరగతి గదుల్లో విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయుడు కర్తవ్యాన్ని మరిచాడు. విద్యార్థులకు మంచి, చెడు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్ధినిలను పిలిచి అర్దనగ్నంగా డ్యాన్సులు వేయించి వారితో అనుచితంగా ప్రవర్తించాడు.
బాలికలు వద్దని చెబుతున్నా పట్టించుకోకుండా వారితో బట్టలు విప్పించి మరీ స్టెప్పులు వేయించాడు ఓ మాష్టర్. విషయం తెలుసుకున్న విద్యార్థినిల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలలో రామ్ సింగ్ ఠాకూర్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈ నెల 11న పాఠశాలకు చెందిన విద్యార్ధినిల తరగతిలోనే అర్దనగ్నంగా డ్యాన్సులు చేయించాడు. బాలికలు అలా చేయలేం సార్ అని చెప్పడంతో వారిని బెదిరించాడు. ఆ బెదిరింపులకు భయపడిన విద్యార్థినులు బట్టలు అయిష్టంగానే విప్పి అర్దనగ్నంగా డ్యాన్సులు చేశారు. అదే సమయంలో సెల్ ఫోన్ లో వీడియో రికార్డ్ చేసుకున్నాడు కీచక ఉపాధ్యాయుడు.
అనంతరం ఈ విషయం ఎవరికి చెప్పొద్దని కర్రతో కొట్టి బెదిరించాడు. ఎవరైనా చెబితే రోజు బెత్తం దెబ్బలు తప్పవని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయితే ఓ బాలిక మాత్రం స్కూల్ లో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. మరో బాలిక కూడా తన తల్లిదండ్రులకు జరిగిన సంఘటనను వివరించింది.
విషయం గ్రామస్తులకు చేరడంతో వారంతా స్కూల్ ప్రధానోపాధ్యాయురాలికి తెలియజేశారు. ఆమె బాలికలతో కలిసి ఉపాధ్యాయుడి మీద పోలిసు స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. రామ్ సింగ్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం అతని వద్ద ఉన్న ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.
అయితే స్కూల్ లో ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు లేని సమయంలో బాలికలతో డ్యాన్సులు వేయించడం.. అందులోనూ అర్ధనగ్నంగా డ్యాన్సులు వేయించడంపై కారణమేంటో అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్ పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
Also Read : ఆడవాళ్ళ నగ్న విడియోలు తీసేది ఆడవాళ్లేనా?