రాననుకున్నారా..? రాలేననుకున్నారా..? అంటూ కరోనా మహమ్మారి సవాల్ విసురుతున్నట్లుంది. గత కొన్ని నెలలుగా కరోనా కేసులు రెండంకెలకు మించకపోవడంతో కరోనా పీడ విరగడ అయిందనుకున్నారు. కరోనా మూడు వేవ్ లు చూసిన జనాలు కరోనా స్వభావంపై ఇంకా ఓ అంచనాకు రాలేకపోతున్నారు. ఎందుకంటే ప్రతిసారి కరోనా కేసుల సంఖ్య అత్యంత దిగువ స్థాయికి చేరి ఆ తరువాత పతాక స్థాయిని చేరుకుంటుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది.
దేశానికి మళ్ళీ కరోనా టెన్షన్ పట్టుకుంది. కొత్త కేసులు రెట్టింపు స్థాయిలో నమోదు అవుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా గణాంకాలను విడుదల చేసింది. 24గంటల వ్యవధిలో 56,551మందిని పరీక్షించగా…1, 805అందికి కరోనా వైరస్ సోకినట్లు తెలిపింది. ముందు రోజు కూడా ఇదే స్థాయిలో కేసులు నమోదు అయినట్లు వెల్లడించింది. రోజువారీ పాజిటివిటి రేటు 3.19శాతంగా ఉందని పేర్కొంది.
దేశంలో కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య పదివేల మార్క్ ను క్రాస్ చేసింది. 134 రోజుల తరువాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. కాగా కరోనాతో దేశవ్యాప్తంగా ఆరుగురు మరణించినట్లు పేర్కొంది.
ఇప్పటివరకు కరోనా 4.47కోట్ల మందికి సోకగా..5.30లక్షల మందిని బలితీసుకుంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం అలర్ట్ అయింది. అని రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలంటూ లేఖలు రాసింది. కోవిడ్ నిబంధనలను అనుసరించేలా ప్రజల్లో అవగాహనా కల్పించాలని సూచించింది. కరోనాను ఏమాత్రం లైట్ తీసుకున్నా చాప చుట్టేయడం ఖాయమని హెచ్చరించింది. కొత్త మ్యుటేషన్లు పుట్టుకోస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలన్నారు.
Also Read : మళ్ళీ దడ పుట్టిస్తోన్న కరోనా – దేశంలో మళ్ళీ ఆంక్షలు