దేశంలో ఎస్సీ, ఎస్టీలకు చట్టసభలో అవకాశం ఉండాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పెద్ద పోరాటమే చేశారు. రిజర్వ్డ్ స్థానాలు ఉండాల్సిందేనని పట్టుబట్టి విజయం సాధించారు. ఏ కులాలైతే రాజ్యాధికారానికి దూరంగా ఉంటాయో ఆ కులాలు కాలక్రమంలో అంతరించిపోతాయని బాబా సాహెబ్ చెప్పి ఉన్నారు. అందుకే రాజ్యాధికారంలో వాటా కోసం రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉండాలన్నారు అంబేద్కర్. ఇందుకోసం మహాత్మా గాంధీని సైతం ధిక్కరించాడు. ఏదీ ఏమైనా భారత రాజ్యాంగం ద్వారా దేశంలోని ఎస్సీ, ఎస్టీలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశమైతే దక్కింది కానీ , అంబేడ్కర్ ఏ ఆశయం కోసమైతే చాలా దూరదృష్టితో రిజర్వ్డ్ స్థానాలు ఉండాలని పట్టుబట్టారో ఇప్పుడు ఆ స్థానాల్లో ఆధిపత్య కులాలవారే రాజ్యం ఏలుతున్నారు. అదేంటి.. ఇది నిబంధనలకు విరుద్దం కదా అనే సందేహం రావొచ్చు. కానీ చాలా తెలివిగా ఆధిపత్య కులాల పార్టీలు రిజర్వ్డ్ స్థానాల్లో అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిన మహిళలకు అవకాశం కల్పిస్తున్నాయి. ఫలితంగా రిజర్వ్డ్ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాల కోసం వాణి వినిపించే వారు లేకుండా పోతున్నారు.
జనరల్ స్థానాల్లో దళితులకు ఏ పార్టీలు అవకాశం ఇవ్వడం లేదు. పోనీ రిజర్వ్డ్ స్థానాల్లోనైనా అవకాశం ఇస్తున్నారా..? అంటే ఆధిపత్య కులాలకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళకు అవకాశం ఇస్తూ దళితుల రాజ్యాధికార వాటాను సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన పార్టీలో లాబియింగ్ చేసి భర్తలు తమ భార్యకు టికెట్ ఇప్పించుకొని డబ్బు ప్రాబల్యంతో గెలిపించుకుంటున్నారు. ఆ తరువాత ఆ నియోజకవర్గంలో ఓసీ అయిన ఆ భర్తదే పెత్తనం. దళిత నేపథ్యం నుంచి వచ్చిన ఆ మహిళా ఎమ్మెల్యే కనీసం వెలివాడల జీవితాలను అర్థం చేసుకునే పరిస్థితి అసలే ఉండదు. అన్నిచోట్ల నాది భర్త కులమేనని చెప్పుకొని.. ఎన్నికల విషయంలో మాత్రం దళిత మహిళా నని చెప్పుకోవడం కనిపిస్తున్నదే. ఇదే కాదు.. రిజర్వ్డ్ స్థానాల్లో పోటీ చేసేందుకు కొంతమంది తప్పుడు కుల దృవీకరణ పత్రాలను సృష్టించి పోటీ చేస్తున్నారు. దీంతో అసలైన దళిత సామజిక వర్గాన్నికి కనీసం రిజర్వ్డ్ స్థానాల్లో ప్రధాన పార్టీల తరుఫున పోటీ చేసే ఛాన్స్ లేకుండా అవకాశాలను ఎగరేసుకుపోతున్నారు.
ఇంకొందరు నిజమైన ఎస్సీ , ఎస్టీలే ఉంటారు. కానీ వీరు రిజర్వేషన్లు ఉపయోగించి పెద్ద, పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేసి బాగా వెనకేసి ఉద్యోగం చివర్లో వీఆరెస్ తీసుకుని ప్రజాసేవ చేస్తామని దిగుతారు. వీళ్ళు ఉద్యోగాలు చేసేటపుడు సొంత జాతిని కనీసం పట్టించుకునే దిక్కుండదు. తమ జాతి ప్రజలు తమదగ్గరకొస్తే ఈసడించుకుంటూ అసహ్యించుకుంటూ దూరం పెడతారు. తీరా ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నపుడు దళిత ఉద్దరుకులుగా ఫోజులు కొడుతారు. ఇలాంటోళ్ళు కూడా ఆదిపత్యకులాల పార్టీలలో చేరి ఆ కులాల కోసమే పనిచేస్తారనేది కళ్ళ ముందు కనిపిస్తోన్నదే.
ఆధిపత్య కులాలకు చెందిన భర్తలు ఎన్నికల్లో రిజర్వుడు స్థానాల్లో పోటీ చేయడానికి ఎస్సీ, ఎస్టీ, బీసిల్లో అందం, అభినయం కల్గిన వారిని తమ భార్యలుగా చేసుకుని ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే , ఎంపీలు, మంత్రులుగా చేస్తారు. అలా చేసి అధికారం మొత్తం వారి గుప్పిట్లో పెట్టుకుంటారు. అలా రిజర్వుడు స్తానాల్లో గెలిచి మంత్రులు అయిన వారి గురించి కింద చూడండి..
1) ఉషశ్రీ చరణ్ అనే ఆమె బీసీ (కురువ) కోటాలో ఒక మంత్రి గా పదవి సంపాదించారు. ఆమె భర్త చరణ్ రెడ్డి (ఓసీ – రెడ్డి)
2) జొన్నలగడ పద్మావతి అనే ఆమె ఎస్సీ మాల. రిజర్వుడు ఎస్సీ నియోజక వర్గం లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆమె భర్త పేరు సాంబశివారెడ్డి (ఓసీ – రెడ్డి)
3) పుష్ప శ్రీవాణి అనే ఆమె ఎస్టీ కులానికి చెందిన వ్యక్తి ఈమె ఎస్టీ రిజర్వుడు నియోజక వర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఎస్టీ కోటాలో మంత్రి కూడా అయ్యారు. ఈమె భర్త పేరు శత్రుచర్ల రాజు (ఓసీ – క్షత్రియ)
4) ఆదిరెడ్డి భవాని బీసీ కులానికి చెందిన వారు. బీసీ కోటాలో ఎమ్మెల్యే అయ్యారు. ఈమె భర్త పేరు ఆదిరెడ్డి చౌదరి (ఓసీ – కమ్మ)
5) పుణ్యశీల బ్రాహ్మణ కులానికి చెందిన మహిళ. ఒక ఎస్సీ మాల వ్యక్తి ని పెళ్ళి చేసుకున్నారు. బ్రాహ్మణ కులం పేరుతో రెండు పదవులు సంపాదించినవి ఉన్నాయి. అవి కాక మాల కులం కోటాలో మళ్లీ APIDC చైర్మన్ అయ్యారు. ఈవిడ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ అని ఎంత మందికి తెలుసు ??జగన్ మాలలకు వారి కోటాలో పదవులు ఇవ్వకుండా వేరే కులాల వాళ్ళకి పదవులు ఇస్తూ.. ఇలా గొప్ప న్యాయం చేస్తున్నారు.
6) ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ. తన భర్త కాపు… ఆమె పోటీ చేసింది sc రిజర్వుడు కానిస్టెన్సీ.. ఈమెకు బాబాసాహెబ్ ఎవరో తెలీదు. ఈమె దళితుల రిప్రజెంట్. అధికారం లో ఉన్నపుడు ఈమె జగన్ ని పొగడని రోజు లేదు. ఇప్పుడు ఈమెను టీడీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సపోర్ట్ చేసిందని సస్పెండ్ చేసారు. వెంటనే వైసీపీ వాళ్ళు ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. దళిత మహిళ కాబట్టి దళితులంతా తనకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఈమె అధికారం లో ఉన్నపుడు బాబాసాహేబ్ విగ్రహం దగ్గర ఈయన ఎవరు అని అడిగినందుకు దళితులంతా ఘోరంగా ట్రోల్ చేసారు. ఎవరి వలన ఆ స్తాయికి వచ్చిందో మర్చిపోవడమే కారణం.
7) విడదల రజనీ బీసీ… ఆమె భర్త కాపు.. ఆమెను కాపు కోటాలో మంత్రి చేసారా? బీసీ కోటాలో చేసారా? ఈమె నిజంగా బీసీ లకు మేలు చేస్తారా?
ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, తెలంగాణలో కూడా ఇలాగే ఉన్నాయి.