కోవిడ్ మళ్ళీ దూకుడు పెంచుతోంది. కోవిడ్ పని అయిపోయినట్లేనని జనం రిలాక్స్ అవుతున్న సమయంలోనే కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వైరల్ ఫీవర్లు, శ్వాసకొస సంబంధిత సమస్యతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు కోవిడ్ పాజిటివిటి రేట్ పెరుగుతుండటంతో కేంద్రం అలర్ట్ అయింది. దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తాజాగా మార్గదర్శకాల్ని జారీ చేసింది.
కొవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలోపలు రాష్ట్రాల గణాంకాల్ని కేంద్రం ఉటంకిస్తోంది. కేరళలో 26.4 శాతం.. మహారాష్ట్రలో 21.7 శాతం.. గుజరాత్ లో 13.9 శాతం.. కర్ణాటకలో 8.6 శాతం.. తమిళనాడులో 6.3 శాతం కేసులు నమోదయ్యాయి. దీంతో కోవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచాలని సూచించింది. గతంలోలాగా ట్రిపుల్ టీ విధానం (టెస్టింగ్.. ట్రాకింగ్.. ట్రీమ్మెంట్ ) విధానం అనుచరించాలని పేర్కొంది.
తాజాగా కేంద్రం జారీ చేసిన గైడ్ లైన్స్ ఇవే
- బయటకు వెళ్లేటప్పుడు మాస్కు ధరించాలి
- క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవటంతో పాటు శానిటైజర్ ను వినియోగించాలి
- దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు వీలైనంత వరకు బయటకు వెళ్లడం తగ్గించాలి.
- వైద్యులు.. పారామెడికల్.. ఇతర ఆరోగ్య సంరక్షక సిబ్బంది తప్పనిసరిగా మాస్కుల్ని ధరించాలి
- రద్దీ ప్రాంతాల్లో మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాలి
- తుమ్మేటప్పుడు.. దగ్గే వేళలో ముక్కు.. నోరు కప్పుకోవటానికి రుమాలు అందుబాటులో ఉంచుకోవాలి
- బయటకు వెళ్లిన ప్రతిసారీ తరచూ చేతుల్ని కడుక్కోవాలి
- బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయటాన్ని బ్యాన్ చేయాలి