ప్రముఖ సినీనటి మీనా రెండో పెళ్లి చేసుకోబోతోంది అని చాలా రోజులుగా పుకార్లు పుడుతున్నాయి. మొదట్లో ఆమె వాటిని ఖండించారు. ఆ తర్వాత అది నిజమేనని స్వయంగా ఒప్పుకున్నారు. ఆమె పెళ్లి ఈ ఏడాది జూలై లో ఓ సుప్రసిద్ధ నటుడితో జరగబోతోంది అని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కానీ ఆమె దానిని మరోసారి ఎప్పటిలా ఖండించారు.
కానీ ఆమెకు అతిసన్నిహితుడు అయిన మిత్రుడు, ప్రముఖ తమిళ నటుడు బెయిలవన్ రంగనాథన్ మీడియాతో మాట్లాడుతూ ”మీనా రెండో పెళ్లి ఓ పాన్ ఇండియన్ హీరోతో జూలై లో జరగబోతోంది. ఆ హీరో వయసు 39 ఏళ్ళు. ఆ హీరో ఎవరో మీకు ఈ పాటికి అర్థమయ్యి ఉంటుంది” అని చిన్న క్లూ ఇచ్చి తప్పించుకున్నాడు.
ఈ వార్త గురించి మీన ఇంకా నోరు విప్ప లేదు. కానీ ఇది కేవలం పుకార్లు మాత్రమేనని నెటిజన్లు కొట్టిపడేస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం రంగనాథన్ ప్రెస్ కు తప్పుడు సమాచారం ఇచ్చాడని మండిపడుతున్నారు. ఇది నిజమో కాదో వారం రోజుల్లో తెలియనుంది.