శనివారం హైదరాబాద్ లోని సోమాజిగూడ లో విద్యుత్ సౌధ ముందు విద్యుత్ శాఖ ఉద్యోగులు ఒక్కసారిగా ఉదృతంగా సమ్మె చేశారు. వీళ్ళ డిమాండ్లు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయి. ఆ డిమాండ్లు నెరవేరుస్తామని లోగడ కెసిఆర్ చాలాసార్లు మాట ఇచ్చి తపించుకున్నారు. కానీ ఈసారి తప్పించుకునే అవకాశం లేకుండా ఉద్యోగులు చాలా కట్టుదిట్టంగా మహాధర్నా చేపట్టారు.
వాళ్ళు సమ్మెలోకి దిగితే రాష్ట్రంలో కరెంట్ ఉత్పత్తి ఎక్కడికక్కడ నిలిచిపోయే ప్రమాదం ఉంది. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. గాలి వీయగానే తుర్పాలా బట్టాలి. కెసిఆర్ నీ జయించాలంటే ఇదే సరైన అదును. అందుకే ధర్నా తో మొదలు పెట్టారు. సమ్మేలోకి దిగుతామని జెఏసి హెచ్చరించింది. అదే జరిగితే తెలంగాణాలో కరెంట్ చార్జీలు భారీగా పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇప్పుడు కెసిఆర్ గొప్ప ఇరకాటంలో పడ్డారు. ఉద్యోగుల కోరికలు తీర్చితే ఖచ్చితంగా కరెంట్ చార్జీల మోత మోగుతుంది. ఎన్నికల ముందు కరెంట్ చార్జీలు పెంచితే తన గోతిని తానూ తొవ్వుకోవడమే. ఇప్పటికే విద్యుత్ శాఖ పీకల్లోతు కష్టాలలో, భారీ నష్టాలలో పురుకుపోయింది. ఎందుకంటే ప్రభుత్వం గత బకాయిలు చెల్లించినట్లయితే విద్యుత్ శాఖ ఈస్థాయిలో ఆర్థిక కష్టాల్లో పూరుకుపోయి ఉండేది కాదు. ప్రతి ఏడాది పరిస్టితి దిగజారుతోంది.
సిబ్బంది జీతాలు, బొగ్గు కొనుగోలు ఇతర అవసరాలకు చేసే ఖర్చుకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ ఆమోదం తెలుపుతుంది. ఈ ఖర్చును అనుసరించి విద్యుత్ చార్జీలను నిర్ణయిస్తారు. అయితే తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ ఆమోదించిన అంచనాలకు మించి విద్యుత్ సంస్థకు ఖర్చు చేయాల్సివస్తోంది.
దీనికితోడు చత్తీస్ గడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసి తెలంగాణ అప్పులు చేసింది. ఆ కిస్తీలు చాలా కాలంగా కట్టనందుకు ఆ ప్రభుత్వం విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ఒకవేళ ప్రభుత్వం నిర్ణీత సమయంలో కిస్తిలు చెల్లించి ఉంటే తక్కువ ధరకే విద్యుత్ లభించేది. ఇది మూలిగే నక్క మీద కుక్క పడ్డట్లు అయ్యింది.
ఇక తప్పనిసరి పరిస్టిలో తెలంగాణ బహిరంగ మార్కెట్లో విద్యుత్ ఎక్కువ ధరకు కొనాల్సి వస్తోంది. ఫలితంగా ఆ భారం ప్రజలపై పడుతుంది. ఇంకా లోతుల్లోకి వెళ్ళితే 2016-2017 నుంచి 2022-23 వరకు అంచనా వేసిన వ్యయం డిస్కమ్ లకు రూ. 10,281.73 కోట్లకు ట్రూ అప్ పిటిషన్లు వేసింది. దీంతో పాటు 1, 2, 3 నియంత్రిత కాలంలో వీలింగ్ ట్రూ అప్ కింద రూ. 203.83 కోట్లు, ఉదయ్ ఒప్పందం ప్రకారం డిస్కమ్ లకు చెల్లించాల్సిన రూ. 2232.84 కోట్లు కలిపి రూ. 127.18 కోటను ప్రజల నుంచి వసూలు చేయడానికి అనుమతి ఇవ్వాలని డిస్కం లు కోరాయి. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు కెసిఆర్ పరిస్టితి ముందు నుయ్యి – వెనక గొయ్యిలా మారింది. ఈ పరిస్తితిలో ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చక పొతే విద్యుత్ నిలిచిపోవచ్చు. కరెంట్ చార్జీలు పెంచితే ఓట్లు పడవు. మరి ఏం చేస్తారో చూడాలి.