తెలంగాణ రాష్ట్ర బీజేపీ అద్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కు హైకోర్టులో ఊరట లభించింది. తనపై యూనివర్సిటీ విధించిన సస్పెన్షన్ ను రద్దు చేయాలని కోరుతూ భగీరధ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తమ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బండి భగీరథ్ ను తరగతులకు అనుమతించాలని యూనివర్సిటీని ఆదేశించింది.
గతంలో యూనివర్సిటీలో సహా విద్యార్ధులపై బండి భగీరథ్ దాడికి పాల్పడిన వీడియోలు బయటకొచ్చాయి. బూతులతో తిడుతూ దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. ర్యాగింగ్ పేరుతో వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. తండ్రి అండ చూసుకొని యూనివర్సిటీలో పెత్తనం చెలాయించినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం రాజకీయ రంగు పులుముకుంది. ఈ నేపథ్యంలోనే బండి భగీరథ్ ను యూనివర్సిటీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
యూనివర్సిటీ తనపై విధించిన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు భగీరథ్. కాలేజ్ లో జరిగిన గొడవలో ఏం జరిగిందో తెలుసుకోకుండానే తనను సస్పెండ్ చేశారని పిటిషన్ దాఖలు చేశారు. కనీసం తన వివరణ కూడా తీసుకోలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. భగీరధ్ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం తమ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భగీరధ్ ను క్లాస్ లకు అనుమతించాలని ఆదేశించింది.
Also Read : కొడుకు కోసం ప్రీతి క్యారెక్టర్ ను దెబ్బకొడుతావా బండి సంజయ్..?