ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలల్లో శుక్రవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అదికూడా రిజర్వేషన్ మీద. నిన్న జరిగిన వాడివేడి సమావేశాలల్లో అతి కీలకమైన మూడు బిల్లులలో రెండు బిల్లులు జగన్ చలువతో ఆమోదం పొందాయి. అందులో ప్రధానమైనది మతం మారిన దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని సభ తీర్మానం చేసింది. దీనిమీడ లోగడ చాలా వాదోపవాదాలు జరిగాయి. అందుకే చాలా సులువుగా అందరు ఆమోదించారు.
రెండవ బిల్లు బోయ వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని కూడా సభ తీర్మానం చేసింది. దీని మీద కూడా లోగడ చాలా చర్చలు జరిగాయి కాబట్టి సభ ఆమోదించింది. ఈ రెండు తీర్మాలను ఆమోదించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ సిఫార్సు చేస్తోంది.
పొతే కాపు రిజర్వేషన్ బిల్లు ఎప్పటిలా నాన్చుడి దొరనికి గురయ్యింది. దీని మీద జగన్ పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనిని కదిలించడం అంటే తేనే తొట్టికి రాయి కొట్టడం లాంటిదేనని దాటవేశారు. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ చాలా కాలంగా ఉన్నదే. అయితే ఈ బిల్లు కూడా శాసనసభ ఆమెదం పొందితే మిగతా రెండు బిల్లులల్తో కలిపి కేంద్రానికి పంపాలి అని కాపు నాయకులు జగాన్ని కోరారు.
దానిని కదిపితే కమ్మ వర్గాస్తులు అడ్డుపడే అవకాశం ఉంది. లేదా కమ్మ వాళ్ళ డిమాండ్లు కూడా లేవనేత్తుతారు. ఒకరిని బుజ్జగిస్తే మరొకరికి కోపం వస్తుంది. అసలే ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు ఇది అవసరమా? అని జగన్ తన కాపు నేతలతో చెప్పినట్లు తెలిసింది. దాంతో కాపు నేతలు అటు మిగాలేక, ఇటు కక్కలేక తలలు పట్టుకున్నారు.
ఓబీసీ కోటాలో 10 శాతం రిజర్వేషన్ ను కేంద్రం కేటాయించింది. అందులో 5 శాతం రిజర్వేషన్ను లోగడ చంద్రబాబునాయుడు ప్రభుత్వం కాపులకు కేటాయించింది. సరిగ్గా ఎన్నికల ముందు చంద్రబాబు జీవో విడుదల చేశారు. కానీ అది అమల్లోకి రాలేదు.
చంద్రబాబు ఆడిన ఈ మైండ్ గేమ్ ను జగన్ ప్రజల్లోకి బాగానే తీసుకునివెళ్ళి ఎన్నికలలో గెలిచారు. కానీ తిరిగి తిరిగి కాపులకు రిజర్వేషన్ విషయానికి వచ్చేసరికి జగన్ కూడా ఇరకాటంలో పడ్డాడు. ఇలాంటి బిల్లులు రాష్ట్రం ఆమోదించినంత మాత్రానా కేంద్రం అమెదించాడు. అక్కడి లెక్కలు వేరు. మన లెక్కలు వేరు. ఈ బిల్లుకు మోక్షం ఎప్పుడు వస్తుందో చూడాలి.