మాజీ ఎం పి, కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ కి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తు సూరత్ కోర్ట్ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఇది విని బిజెపి పండగ చేసుకుంది. అదే ఛాన్స్ అనుకుని రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం మీద అనర్హత వేటు పడేలా చేసింది. ఇదే అదును అనుకుని అతనికి న్యూ ఢిల్లీలో కేటాయించిన లూటీయేన్స్ భవంతిని 30 రోజులల్లో ఖాళి చేయాలి అని నోటీసులు వచ్చేలా చేసింది. ఈ నోటిసు నుంచి తప్పించుకోవాలంటే హై కోర్ట్ నుంచి ఉపశనం పొందితే తప్పా అందులో ఉండలేరు.
ఇలాంటి శిక్షలు పడడం భారతదేశ చరిత్రలో కొత్త కాదు. ఇలాంటి కేసులలో లోగడ చాలామంది నేతలు ఎదుర్కున్నారు. అయితే వీళ్ళందరూ నేరాలు – ఘోరాలు చేసి ప్రజలను అష్టకష్టాలపాలు చేసినవాళ్లు. కానీ రాహుల్ గాంధీ ఒక్కడే ఎలాంటి నేరం చేయకుండా కేవలం నోరుజారి ‘ఒక్క తప్పుడు మాట మాట్లాడి’ చట్టానికి అడ్డాగా దొరకడం సోచనీయం. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు.
ఆజామ్ ఖాన్ మత ద్వేషాలు రెచ్చగొట్టి నందుకు ఆయనకు 2022 అక్టోబర్ లో 3 ఏళ్ల జైలు శిక్ష పడింది. అప్పుడు కూడా అతని అసెంబ్లీ సభ్యత్వం మీద వేటుపడింది. కానీ రాహుల్ గాంధీ ఎలాంటి మత ద్వేషాలు రెచ్చగొట్టలేదు అని ప్రజలు గమనించాలి. నేరాలు – ఘూరాలు చేశారు అని అందరూ ఒప్పుకున్న లలిత్ మోడీ, నీరవ్ మోడీని మాత్రమే నిందించారు. కానీ ఈ కేసు పెట్టిన బిజెపి ఎమ్మెల్లే, మాజీ మంత్రి పూర్ణేష్ మోడీని నిందించలేదు. ఇతర మోడీలను కూడా నిందించలేదు. కానీ మోడీ లు అందరు ఏకమయ్యి రాహుల్ గాంధీని చట్టం చేతిలో ఇరికించారు. దీని వెనక ప్రధాని మోడీ హస్తం ఉన్నదని అందరికి తెలిసిపోయింది.
ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంలో కొన్ని కోట్ల అవినీతికి పాలుపడ్డాడు. అది రుజువయ్యింది. 2013 సెప్టెంబర్ లో ఆయన అవినీతికి పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. దాంతో అప్పుడు బీహార్ లోని సరన్ నియోగక వర్గానికి ఎంపి గా ఉన్న అతని మీద అనర్హత వేటు పడింది. కానీ రాహుల్ గాంధీ ఎలాంటి కుంభకోణం చేయలేదు అని ఇక్కడ మనం గమనించాలి.
నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని కోర్టు రుజువు చేసి 2014 సెప్టెంబర్లో ఆమెకు జైలు శిక్ష విధించింది. అప్పుడు కూడా ఆమెకు అసెంబ్లీ సభ్యురాలిగా అనర్హత వేటు పడి, సిఎం గా గద్దె దిగింది. కానీ రాహుల్ గాంధీ ఎలాంటి అక్రమ ఆస్తులు సంపాదించలేదు అని గమనించాలి.
ఓ హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్ని 2023 జనవరిలో కోర్ట్ దోషిగా తేల్చింది. అతని మీద కూడా పార్లమెంట్ సభ్యత్వం మీద వేటుపడింది. కానీ రాహుల్ గాంధీ ఎలాంటి హత్యలకు పాల్పడలేదు అని గమనించాలి.
అనిల్ కుమార్ సాహ్ని కీ ఒకరిని మోసం చేసిన కేసులో 3 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీనితో బీహార్ అసెంబ్లీ నుంచి అనర్హత వేటు పడింది. కానీ రాహుల్ గాంధీ ఎలాంటి మోసాలకు పాల్పడలేదు అని గమనించాలి.
విక్రమ్ సింగ్ సైని ముజఫర్ నగర్ అల్లర్ల కేసులో కోర్ట్ దోషిగా తేల్చి 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతని అసంబ్లీ సభ్యత్వం మీద వేటు పడింది. కానీ రాహుల్ గాంధీ ఎలాంటి అల్లర్లకు పాల్పడలేదు అని గమనించాలి.
దాడి కేసులో ప్రదీప్ చౌదరికీ 3 ఏళ్ల జైలు శిక్ష పడింది. అతని మీద కూడా అసంబ్లీ సభ్యత్వం మీద వేటుపడింది. కానీ రాహుల్ గాంధీ ఎలాంటి దాడులకు పాల్పడలేదు అని గమనించాలి. ఇలా చెప్పుకుంటూ పొతే చాలామంది ఉన్నారు.
మన దగ్గర ఒకే రకం తాడు ఉంటుంది. దానితో గాడిదలను కట్టేస్తాము. అవసరం పడితే గుర్రాన్ని కూడా అదే తాడుతో కట్టేస్తాము. అంతమాత్రానా గుర్రం గాడిద అవ్వదుగా? చట్టం అందరికి సమానం. అందరికి సమానంగా శిక్ష విదిస్తుంది. ఒక్కటి మాత్రం నిజం. శిక్ష పడినంత మాత్రాన, తొందరపాటు ఉన్న రాహుల్ గాంధీ లాంటి వాళ్లు నేరస్తులు కాదు.