రాహుల్ గాంధీపై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. పరువు నష్టం దావా కేసులో దోషిగా తేలడంతో రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారు. రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కు వెళ్లేందుకు నెల రోజుల గడువు విధించింది. ఈలోగా కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కు వెళ్లి స్టే తెచ్చుకుంటారని అనుకున్నారేమో ఏమో వెంటనే రాహుల్ గాంధీపై లోక్ సభ సెక్రటేరియట్ చర్యలు చేపట్టింది.
ప్రభుత్వ వ్యతిరేకులు ముఖ్యంగా పోటీదారులపై వ్యవస్థలు ఎంత వేగంగా స్పందిస్తాయో మరోసారి రుజువు అయింది. సూరత్ కోర్టు రాహుల్ గాంధీ విషయంలో ఇచ్చిన తీర్పు కాపీ లోక్ సభ సెక్రటేరియట్ కు అందిందో లేదో స్పష్టత లేదు. ఈ తీర్పు వచ్చిన ఒక్క రోజు వ్యవధిలోనే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు. ఒక్క రోజు గడువు కూడా ఇవ్వకుండా అనర్హత వేటు వేయడం అందర్నీ ఆలోచింపజేస్తోంది.
రాజకీయ విమర్శలు చేసినందుకు రెండేళ్ళ జైలు శిక్ష విధించడం అనూహ్యం అంటే అంతకుమించి రాహుల్ గాంధీని పార్లమెంట్ ను గెంటేశారు. రాజకీయాల్లో దారుణమైన నేరాలకు పాల్పడిన వారు.. ఆర్ధిక మోసాలకు పాల్పడిన వారు యదేచ్చగా రాజకీయాలు చేస్తున్నారు. ఇందులో ఏళ్లతరబడి విచారణ కొనసాగుతోంది. ఎవరూ అనర్హత వేటుకు గురి కాలేదు.
ఆర్థిక నేరాలకు పాల్పడిన నేరగాళ్ళు అధికారం అండతో వ్యవస్థల్ని మేమేజ్ చేస్తూ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. లలిత్ మోడీ , నీరవ్ మోడీ లాంటి ఆర్ధిక నేరగాళ్ళను ఉద్దేశిస్తూ మోడీ ఇంటి పేరున్న వారంతా దొంగలేనని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు జైలు శిక్ష విధించారు. పైగా… ప్రజా ప్రాతినిధ్యం చట్టం పేరుతో రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేశారు.
Also Read : బిగ్ న్యూస్ – నరేంద్ర మోడీకి రెండేళ్ళ జైలు శిక్ష..!?