ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారా..? నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నా పెడచెవిన పెడుతున్న జగన్ కు తాజాగా ఝలక్ ఇచ్చేందుకు సిద్డమయ్యారా..? ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్ ఇచ్చి జగన్ పీచమణచాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు చూస్తున్నారా..? ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మాదేనని ధీమాగా చెబుతున్నా టీడీపీ నేతలకు టచ్ లో 16మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
గురువారం ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మొత్తం ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడుగురు వైసీపీ, ఒకరు టీడీపీ అభ్యర్థి బరిలో ఉన్నారు. ఈ క్రమంలో పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ నేతలు… ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం టీడీపీకి ఓట్లు వేస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు , గోరంట్ల బుచ్చయ్య వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చాక వంద మంది ఎమ్మెల్యేలకు కూడా జగన్ ఏనాడూ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమా అని ఎమ్మెల్యేలందరితో మాట్లాడుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు వెంటనే మంజూరు చేస్తున్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేస్తున్నారు. ఎవరెవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారందరితో జగన్ తియ్యగా మాట్లాడుతున్నారు. కానీ ఇదంతా ఎమ్మెల్సీ ఎన్నికల వరకేనని ఆ అసంతృప్త ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అందుకే కొంతమంది ఎమ్మెల్యేలు జగన్ కు షాక్ ఇచ్చేందుకు సిద్దమయ్యారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
వైసీపీ ఓట్లు చేజారిపోకుండా మాక్ పోలింగ్ నిర్వహించారు. ఓటు ఎలా వేయాలనే దానిపై ఎమ్మెల్యేలకు అవగాహనా కల్పించారు. రహస్యంగా జరిగే ఈ ఎన్నికల్లో ఏ ఎమ్మెల్యే ఎవరికీ ఓటు వేశారో తెలియదు. అందుకే వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు జగన్ కు బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం. వారు పార్టీ మరెందుకు రెడీ అయ్యే… పంచుమర్తి అనురాధకు మద్దతుగా నిలవాలని ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు అసెంబ్లీ ప్రాంగణం వద్ద మాట్లాడుతూ.. వైసీపీ నుంచి ఫిరాయింపులు మొదలయ్యాయని వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా వైసీపీలో ఆందోళన స్టార్ట్ అయింది.
వైసీపీ ఎమ్మెల్యేల్లో కొంతమంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే క్యాంప్ లు నిర్వహించారు. అయితే, అర్ధరాత్రి హోటల్ రూమ్ నుంచి వెళ్లిపోయిన మద్దాలగిరి, వాసుపల్లి గణేష్ ,తాడికొండ శ్రీదేవి మరియు వసంత కృష్ణ ప్రసాద్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వైసీపీలో ఆందోళన కనిపిస్తోంది. వారు వైసీపీ అధిష్టానంతో కూడా టచ్ లో లేకపోవడంతో వైసీపీ శిబిరంలో నిస్తేజం కనిపిస్తోంది.
Also Read : జగన్ లేదా అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రత్యర్ధిగా సునీత – చంద్రబాబు మాస్టర్ ప్లాన్