ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం తేడా వస్తే ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారా..? శాసన మండలిని రద్దు చేయబోతున్నారా..? అంటే జగన్ మనస్తతత్వం తెలిసిన కొంతమంది నేతలు అవుననే అంటున్నారు.
గతంలో ప్రభుత్వ బిల్లులకు విలువ ఇవ్వకుండా.. పార్టీ అభిప్రాయం మేరకు మండలిలో ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారనే ఉద్దేశ్యంతో కౌన్సిల్ రద్దుకు జగన్ మొగ్గు చూపారు. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. కానీ తరువాత జరిగిన పరిణామాలతో తీర్మాణాన్ని రద్దు చేస్తున్నట్లు సభలోనే ప్రకటించారు. మళ్ళీ ఇప్పుడు మండలి రద్దుపై చర్చలు జరుగుతోన్నాయి . కారణం ఎమ్మెల్యే కోటాలో జరుగుతోన్న ఎమ్మెల్సీ ఎన్నికలు.
ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలొచ్చాయి. ఆరుగురు ఎమ్మెల్సీలు వైసీపీ తరుఫున గెలవడం ఖాయం. కానీ ఏడో స్థానంలో తీవ్ర ఉత్కంట నెలకొంది. టీడీపీ తమ అభ్యర్థిని బరిలో నిలిపింది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓట్ చేసినా, చెల్లని ఓటు వేసినా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుస్తారు. అధికార పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు బయటపడ్డారు. దీంతో జగన్ ఏడో స్థానం విషయంలో ఆందోళన చెందుతున్నారు.
ఒక్కో మంత్రికి 22మంది ఎమ్మెల్యే లను అప్పగించి ఏడుగురితో కమిటీని ఏర్పాటు చేశారు. వారందరికీ మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటు ఎలా వేయాలని నేర్పిస్తున్నారు. వైసీపీ సభ్యుల్లో ఒకరిద్దరు చెల్లని ఓటు వేసినా అది టీడీపీకి లాభిస్తుంది.అందుకే ఎలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
పొరపాటున ఏదైనా జరిగితే వైసీపీ బలహీన పడుతుందని.. ఎమ్మెల్యేలకు జగన్ పై విశ్వాసం లేదని టీడీపీ ప్రచారం చేసుకుంటుంది. మండలికి ఇటీవలే ముగ్గురు ఎన్నిక అవ్వగా మరొకరు ఎన్నిక అయ్యారని..వచ్చే ఎన్నికల్లో అధికారం టీడీపీదేనని ప్రజలను సైకిల్ పార్టీ అట్రాక్ట్ చేసుకుంటుంది. అదే జరిగితే జగన్ అసహనానికి గురవుతారు. అందరు మరిచిపోయిన మండలి రద్దు నిర్ణయానికి తాజాగా మొగ్గు చూపోచ్చని వైసీపీలో సెటైర్లు వస్తున్నాయి.
Also Read : జగన్ లేదా అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రత్యర్ధిగా సునీత – చంద్రబాబు మాస్టర్ ప్లాన్