రాజకీయ నాయకులకు ‘పదవులు’ కావాలి, కామాంధులకు అమ్మాయి ‘పెదవులు’ కావాలి. అవి లేకపోతే వాళ్ళు బతకలేరు. ప్రజా సేవ చేయడానికి కాదు. తాము అక్రమాలు చేసి సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోడానికి, జైలుకు వెళ్లి చిప్ప కూడు తినకుండా ఉండడానికి. ప్రతిపక్షంలో ఉంటే తాము చేసిన స్కాం లు బయటపడతాయి. ఆవుల కుమ్ములాటలో లేగ దూడ కాళ్ళు విరిగినట్లు జగన్, చంద్రబాబు నాయుడు కుమ్ములాటలో ఏమ్మేల్లెలు, ఎంపి ల కాళ్ళు విరగొచ్చు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దు కోవాలి. పదవి లో ఉండగానే మరో పార్టీలో టికెట్ సంపాదించుకోవాలి. ఇది రాజకీయ ఫిలాసఫీ.
ఆంద్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు జనవరి నుంచి వీస్తున్నాయి అని పలు సర్వేలు తేల్చి చెప్పాయి. అందుకే చంద్రబాబు నాయుడు రెచ్చి పోతున్నారు. జగన్ కృంగిపోతున్నారు. దీనికి గొప్ప రీజన్ లు, లాజిక్ లు అక్కర లేదు. ప్రజలు మార్పు కోరుకుంటారు. ఆ మార్పు ఎలాంటిదంటే – మన దేశాని చెందిన మిస్ యూనివర్స్ చెప్పిన సూత్రం గుర్తుకు వస్తుంది. ఆమె ప్రపంచ సుందరి అని ఓ ధనవంతుడు పెళ్లి చేసుకున్నాడు. ఏడాది తర్వాత ఆమె మీద మోజు తీరిన ఆ మొగుడు పనిమనిషి వెంట పడ్డాడు. ఆ పనిమనిషి గొప్ప అందగత్తె అని కాదు. వాడికి మార్పు కావాలి. ఇది అంతే! జనానికి మార్పు కావాలి.
ఈ మార్పును ప్రతిపక్షాలు చాలా తెలివిగా వాడుకుంటాయి. ఉదాహరణకి చంద్రబాబు చాలా మీటింగ్ లల్లో జగన్ ని ఎద్దేవ చేస్తూ ”మీలో జగన్ ఇచ్చిన ఇళ్ళు ఎంతమందికి వచ్చాయో చేతులు ఎత్తండి తమ్ముళ్ళు” అంటారు.
ఒక్కడు కూడా చేతులు ఎత్తడు. అంటే ఎవ్వరికి ఇళ్ళు రాలేదు అని జనం గుడ్డిగా నమ్ముతారు. అంటే చంద్రబాబు మాకు ఇళ్ళు ఇస్తాడు అనే ఆశలతో జగాన్నీ గద్దె దించాలని 90 శాతం జనం ఆక్షణం ఫిక్స్ అవుతారు. అది వైరల్ అవుతుంది.
గత ఎన్నికలల్లో జగన్ కూడా ఇదే ఫార్ములను నమ్ముకున్నవాడే. జగన్ కూడా మీటింగ్ లల్లో చంద్రబాబుని ఎద్దేవ చేస్తూ ”మీలో చంద్రబాబు ఇచ్చిన ఇళ్ళు ఎంతమందికి వచ్చాయో చేతులు ఎత్తండి అన్నాలు” అంటారు.
ఒక్కడు కూడా చేతులు ఎత్తడు. అంటే ఎవ్వరికి ఇళ్ళు రాలేదు అని జనం గుడ్డిగా నమ్ముతారు. అంటే జగన్ కు ఓటు వేస్తే మాకు ఇళ్ళు ఇస్తాడు అనే ఆశలతో చంద్ర బాబును గద్దె దింపాలని 90 శాతం జనం ఆ క్షణం ఫిక్స్ అవుతారు. అది వైరల్ అవుతుంది.
ఆ ఇళ్ళు అటు జగన్ ఇవ్వడు, ఇటు చంద్ర బాబు కూడా ఇవ్వడు. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ సంక్షేమ పథకం చేపట్టినా 5 నుంచి 10 శాతం పేదలకే అందుతాయి. మిగతా 90 శాతం పేదలు నిరాశతో ఎప్పటికప్పుడు కొత్త ప్రభుత్వాని కోరుకుంటారు. ఇదీ అసలు రహస్యం.
జగన్ సర్కార్ లో ఉండగానే తెలుగు దేశంలో సీట్లు సంపాదించుకోవాలని దాదాపు 29 మంది జగన్ మనుషులు అప్పుడే తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీనికి రెండు కారణాలు.
ఒకటి – ఈసారి ఎన్నికలలో తెలుగు దేశం ప్రభుత్వం గెలుస్తుంది అని సర్వే రిపోర్ట్ లు రావడం.
రెండు – ఎమ్మెల్సి ఎన్నికలలో జగన్ ఘోర పరాభవం పొందడం. అందుకే నిన్నటివరకు జగన్ చుట్టూ ఈగల్లా ముసిరిన వలస పక్షి నాయకులు మెల్లిగా చంద్రబాబు బెల్లం చుట్టూ ముసురుతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందులో రెండు రకాల నాయకులు ఉన్నారు.
మొదటి రకం – జగన్ తో చివాట్లు తిన్నవాళ్ళు, లేదా జగన్ తెలివిగా పక్కన పెట్టిన నాయకులు. ఇలాంటివాళ్ళు దాదాపు 1౦ మంది వరకు ఉంటారు. మొదటి వరుసలో విజయ సాయి రెడ్డి ఉన్నాడు. ఇతను తెలుగుదేశం తీర్థం పుచ్చుకోడానికి అప్పుడే కార్యాచరణ మొదలయింది.
రెండో రకం : ఈసారి ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్లే సీట్ రాకపోవచ్చు, మంత్రి పదవి రాకవచ్చు అనుకునే ఎమ్మెల్ల్యేలు. ఇందులో దాదాపు 19 మంది ఉన్నారు. వీళ్లల్లో పిల్లి సుభాష్ చంద్ర బోసు లాంటి వాళ్లు ముందు వరుసలో ఉన్నాను. మిగతా వాళ్లు వాళ్ళు ఎవ్వరో మీకు తెలిసిందే. మరి కొన్ని రోజులు గడిస్తే మరి కొంత క్లారిటీ వస్తుంది.
Also Read : జగన్ లేదా అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రత్యర్ధిగా సునీత – చంద్రబాబు మాస్టర్ ప్లాన్