వైసీపీ అంటే ఐ ప్యాక్ అనుకుంటున్నారు జగన్. ఆయన ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకున్న మొదట సంప్రదించేది ఐ ప్యాక్ నే. నేతలు ఏమనుకుకుంటున్నారు..? క్యాడర్ ఏం కోరుకుంటుంది..? అనేది అస్సలు పట్టించుకోరు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల విషయంలోనూ పార్టీ నేతలతో సమీక్ష చేయకుండా ఐ ప్యాక్ తో మాట్లాడారు. ఎందుకిలా నిరుత్సాహపరిచే ఫలితాలు వచ్చాయని ప్రశ్నించారు. ఈ విషయాలను ఎవరో కాదు ఐ ప్యాకే లీక్ చేస్తుండటం గమనార్హం.
2019లో వైసీపీకి దక్కిన విజయం పూర్తిగా ఐ ప్యాక్ దేనని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. తన పాదయాత్రకు కూడా ఆ క్రెడిట్ ఇవ్వదలుచుకోవదం లేదు. అందుకే వైసీపీలో అంత ఐ ప్యాకే. ఐ ప్యాక్ ఏం చెబితే అదే జరుగుతోంది. వారిచ్చే సలహాలు, సూచనలను అమలు చేస్తారు. వారిచ్చే సలహాలు, సూచనలతో ఏం జరుగుతుందని కూడా ఆలోచించరు. ఇటీవల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ప్రైవేట్ టీచర్లను ఓటర్లుగా చేర్చాలని…యువత మద్దతుతో ఎన్నికల్లో గెలవవచ్చునని నివేదిక ఇచ్చారు. ఐ ప్యాక్ నివేదికతో అన్ని స్థానాల్లో గెలుస్తామని జగన్ ధీమాగా ఉన్నారు. కానీ రిజల్ట్ తేడా కొట్టేసింది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంతో జగన్ మొదటిసారిగా ఐ ప్యాక్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఇంత చిన్న ఎన్నికను మేనేజ్ చేయలేకపోతే మీ వ్యూహాలు ఎందుకని జగన్ అరవడంతో ఐ ప్యాక్ బృందం షాక్ అయినట్లు తెలుస్తోంది. పట్టభద్రులు ఆగ్రహంతో ఉన్నారని.. వారిని ఆకట్టుకునేందుకు ఏదోటి చేయాలని ఎందుకు సూచించలేదని జగన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
Also Read : ఎమ్మెల్సీ ఎన్నికలు.. కొత్త సమీకరణాలు – గంటా రాజీనామాపై వైసీపీలో తర్జనభర్జన
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే వ్యూహాన్ని అమలు చేయడంలో ఐప్యాక్ ఫ్లాపైంది. దానితో మూడు ఎమ్మెల్సీల్లో ఘోరపరాజయం మూటగట్టుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాలు తప్పితే, వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తారని జగన్ ప్రశ్నించడంతో వారికి నోట మాట రాలేదని చెబుతున్నారు. మిమల్ని నమ్మకుంటే నాకు శఠగోపం పెట్టేలా ఉన్నారని జగన్ అన్నట్లు చెబుతున్నారు.
ఎమ్మెల్సీ విజయాలను టీడీపీ సోషల్ మీడియా విభాగం మాత్రం పక్కాగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఏపీ సర్కార్ పై వ్యతిరేకతకు ఈ ఫలితాలే నిదర్శనమని రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేస్తూ టీడీపీకి బూస్టింగ్ ఇస్తున్నారు. కానీ వైసీపీని నడిపించే ఐ ప్యాక్ మాత్రం ఈ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి కౌంటర్ ను పెల్చలేక దిక్కులు చూస్తోంది.
Also Read : ఎన్నికల మూడ్ లోకి చంద్రబాబు – వంద స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారా..?