ఈడి దర్యాప్తు అధికారి జోగేంద్ర కు కల్వకుంట్ల కవిత ఈ రోజు ఓ లేఖ రాశారు. అదిప్పుడు సంచలనం గా మారింది. ఆమె ఆ లేఖలో అతనిని నిందిస్తూ తాను ఫోన్ల ధ్వంసం చేసినట్లు ఆరోపించడం దారుణం అన్నారు. ఇది కేవలం దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ, లోగడ తాను వాడిన పోన్లు అధికారులకు సంపర్పించాను అని పేర్కొన్నారు.
‘దీనికితోడు ఒక మహిళ ఫోన్ స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా?’ అని ఆమె ఘాటుగా స్పందించారు. ఇది కేవలం దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు అని తన ఆవేదన వెళ్లగక్కారు.
తాను సెల్ ఫోన్ లు ధ్వంసం చేశానని పేర్నకొనడం కేవలం ఓ కుట్ర గా అభివర్ణించారు. తనను కనీసం సమన్ చేయకుండా, లేదా అడగకుండానే ఏ పరిస్థితుల్లో దర్యాప్తు సంస్థ ఎందుకు ఈ ఆరోపణలు చేసింది? అని నిలదీశారు.
ఆమెను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడి ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే అని ఆమె ధ్వజమెత్తారు.
తప్పుడు ఆరోపణలుచేస్తూ, కావాలని ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల తన రాజకీయ ప్రత్యర్థులు తనను ప్రజల్లో నిందిస్తున్నారు అని అందులో పేర్కొన్నారు.
తద్వారా తన పరువు ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా, తన పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగింది అని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా కాకుండా, ఈడి వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్నారు. కానీ విధి నిర్వాహానను తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరం అని ఆరోపించాఫు.
దీనికి జవాబు ఇవ్వడానికి ఇప్పుడు ఈ డి అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆమెకు ఘాటుగా జవాబు ఇవ్వడానికి చట్టంలో ఉన్న అధికారాలను ఆమెను తెలిపే యోచనలో ఉన్నారు.