పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైసీపీ డీలా పడింది. దీని నుంచి బయటపడేందుకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఏడు స్థానాలను చేజారిపోకుండా ఎమ్మెల్యేలను ట్రైన్ చేస్తున్నారు. ఆరు స్థానాలు వైసీపీ గెలుచుకోవడం పక్కా.. మరో స్థానం కోసం టీడీపీ నుంచి తీవ్ర పోటీ ఉంది. అంత బాగానే ఉన్నా వైసీపీ , టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎటువైపు నిలుస్తారనేది హాట్ టాపిక్ గా మారింది.
ఎమ్మెల్యేల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతి తెలివి ప్రదర్శిస్తే అనర్హత వేటు పడుతుంది. ఓటింగ్ కు గైర్హాజర్ అయినా చెల్లని ఓటు వేసినా సీన్ మొత్తం మారిపోతుంది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడమేలా అనే పాఠాలను తమ పార్టీ ఎమ్మెల్యేలకు నేర్పుతుంది వైసీపీ అధిష్టానం. ప్రతి రోజు వైసీపీ నేతలతో ప్రాక్టీస్ చేయిస్తోంది. ఎంత ప్రాక్టీస్ చేయించినా ఎమ్మెల్యేలు పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేయాలనుకుంటే మాత్రం ఏం చేయలేం. కానీ ఓ క్లారిటీ వస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేలే ఆ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని స్పష్టం అవుతుంది. ఎవరు వ్యతిరేకంగా ఒటేశారో తెలియదు కాబట్టి వైసీపీలోని కొంతమంది వ్యతిరేకంగా ఓటేసిన ఆశ్చర్యపోనవసరం లేదు.
సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో కొంతమందిపై నమ్మకం కోల్పోయిన వైసీపీ.. ఇప్పుడు టీడీపీకి ఓట్లు తగ్గించడం ఎలా అనే దానిపై దృష్టి సారించింది. ప్రస్తుతం స్పీకర్ వద్ద గంటా శ్రీనివాస్ రాజీనామా లేఖ పెండింగ్ లో ఉంది. ఆయన ఎప్పుడో రాజీనామా చేసిన ఇంకా ఆమోదించలేదు. అలాగని తిరస్కరించలేదు. టీడీపీతో గంటా అంటీముట్టినట్లుగా ఉన్నా ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. దీంతో ఆయన రాజీనామాను ఆమోదించినట్లుగా నోటిఫికేషన్ ఇస్తే టీడీపీ సభ్యుల్లో ఒకరు తగ్గుతారని లెక్కలు వేసుకుంటుంది వైసీపీ.
గంటా రాజీనామాను ఇన్నాళ్ళు పెండింగ్ లో ఉంచి ఇప్పుడు ఆమోదిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ సభ్యుడి రాజీనామాను తాజాగా ఆమోదించారని అనుకుంటారు. అదే సమయంలో గంటా రాజీనామాను ఆమోదిస్తే ఉప ఎన్నిక వస్తోంది. దాని ఎదుర్కొంటామని వైసీపీకి నమ్మకం కల్గితే గంటా రాజీనామాను ఆమోదిస్తారు. లేదంటే పెండింగ్ లోనే ఉంచుతారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓడితే ఆ ప్రభావం సాధారణ ఎన్నికలపై పడుతుంది. కాబట్టి గంటా శ్రీనివాస్ రాజీనామాను లేఖను ఆమోదించాలా..? లేదా అనే విషయంలో వైసీపీ తర్జనభర్జన పడుతోంది.
Also Read : ఎన్నికల మూడ్ లోకి చంద్రబాబు – వంద స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారా..?