మీరు ‘శత్రువు’ సినిమా చూసారా? అందులోని కోట శ్రీనివాసర మ్యానరిజం గుర్తుందా? ఈ జన్మకు మరిచిపోరు. కోట విలన్ గా పచ్చి నెత్తురు ఎలా తాగాలో ప్లాన్ చేస్తుంటాడు. ఈలోగా అతనికి ఎదురుగ ఉన్న అమ్మయి పైట జారిపోతుంది.
అంతే! మూడ్ ఆఫ్ అయ్యిన కోట ”పైట జారిపోయింది రా బాబోయ్…” అని విసుక్కుంటాడు.
అతని అనుచరులు వెంటనే ఆమెకు పైట వేస్తారు.
వెంటనే మూడ్ ఆన్ అయ్యిన కోట ”థాంక్స్” అని అసలు సీన్ లోకి వెళ్ళతాడు.
మరో చోట ఒకడిని చంపద్దనికి హోటల్ కి వెళ్ళతాడు. సీరియస్ సీన్. అక్కడ ఓ పౌన్ టైన్ నీళ్ళు వేదజిమ్ముతుంది. అంతే! మూడ్ ఆఫ్ అయ్యిన కోట ”హోటల్లో ఈ జలపాతాలు ఎందుకురా బాబోయ్…” అని విసుక్కుంటాడు.
అతని అనుచరులు వెంటనే దానిని ఆఫ్ చేస్తారు.
వెంటనే మూడ్ ఆన్ అయ్యిన కోట ”థాంక్స్” అని అసలు సీన్ లోకి వెళ్ళతాడు.
క్లైమాక్స్ లో కోట వెంకటేష్ ని చంపబోతాడు. అక్కడ కొన్ని శవాలు పడి ఉంటాయి.
అంతే! మూడ్ ఆఫ్ అయ్యిన కోట ”ఈ శవాలతో కోళ్ళ ఫోరం అయ్యిందిరా బాబోయ్…” అని విసుక్కుంటాడు.
అతని అనుచరులు వెంటనే శవాలను తొలగిసారు.
వెంటనే మూడ్ ఆన్ అయ్యిన కోట ”థాంక్స్” అని అసలు సీన్ లోకి వెళ్ళతాడు.
ఆ సీన్ కి, ఆ మ్యానరిజానికి ఎక్కడా సంబంధం ఉండరు. కానీ ధియేటర్ లో నవ్వులు పుయిస్తాయి. ఆ ఒక్క మ్యానరిజం వల్ల ఆ సినిమా గొప్ప విజయం సాధించింది.
అయన చనిపోయినట్లు వచ్చిన వార్తలు వినిన అయన ఇదే మ్యానరిజంతో ”నేను సచ్చి పోలేదురా బాబొయ్… ఇంకా బతికే తగలడ్డాను…” కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన ఇంకా చలాకీగా ఉన్నారు అనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.
మనం మూడ్ ఆన్ చేసుకుని ”థాంక్స్” అనాలి.