నాగబాబు కూతురు నిహారిక అల్లరి పిల్ల. ఆయన అల్లుడు చైతన్య మాత్రం సైలెంట్. సోషల్ మీడియాలో ఈ జంట యాక్టివ్ గానే ఉంటుంది. తమకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అప్డేట్స్ ఇస్తుంటారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోనున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది.
చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం 2020డిసెంబర్ లో జరిగింది. చైతన్య చాలా మంచి వాడని తన స్వేఛ్చకు పరిమితులు విధించడని భర్త గురించి గతంలో నిహారిక గొప్పగా చెప్పింది కూడా. పార్టీలు, వెకేషన్స్ అంటూ కలిసి తిరిగే ఈ జంట కొన్ని రోజులుగా సైలెంట్ అయిపొయింది. గతంలో సోషల్ మీడియాలో జంటగానున్న పిక్స్ షేర్ చేసే వీరు ఇప్పుడు ఒంటరిగానున్న ఫోటోలను షేర్ చేయడం స్టార్ట్ చేశారు. విడిపోవాలనే నిర్ణయం తీసుకొని ఈవిధంగా వ్యవహరిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.
గతంలోనూ వీరు విడిపోనున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అప్పుడు చైతన్య తన సోషల్ మీడియా ఖాతాలో నిహారికతోనున్న వీడియోను షేర్ చేసి ఈ విడాకుల వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. కానీ తాజాగా మరోసారి ఈ జంట విడిపోనుందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
తన ఇన్ స్టాగ్రాంలో నిహారికతో ఉన్న ఫోటోలన్నింటిని డిలీట్ చేశాడు. సింగిల్ గా నిహారిక ఉన్న ఫోటోలు కూడా తీసేశాడు. పెళ్లి ఫోటోలను కూడా తీసేయడంతో వీరి విడాకుల వార్తకు ప్రాధాన్యత ఏర్పడింది. అంతేకాదు ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు.
విడిపోవడానికి సిద్దపడే ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకొని…ఇద్దరు కలిసున్న ఫోటోలను తీసేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఐతే.. ఈ చూడముచ్చటైన జంట ఎందుకు విడిపోవాలనే నిర్ణయాన్ని తీసుకుందని సోషల్ మీడియాలో డిబేట్ స్టార్ట్ చేశారు.
Also Read : సమంత గర్భం దాల్చితే చైతూ అబార్షన్ కూడా చేయించాడా… అందుకేనా విడిపోయింది..?