ఏపీ సీఎం జగన్ తో అదాని నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. తాడేపల్లిలో సీఎం జగన్ కలిసిన మరుసటి రోజు తరువాత అదాని ఏపీకి వచ్చారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఎందుకీ సీక్రెట్ భేటీ అనే ప్రశ్నలు తలెత్తడంతో వైసీపీ ఇచ్చిన సమాధానం నమ్మశక్యంగా అనిపించడం లేదు.
అదాని కుమారుడి వివాహానికి జగన్ ను ఆహ్వానించేందుకే ఆయన తాడేపల్లికి వచ్చారని చెబుతున్నారు. నిజంగా.. కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకే జగన్ తో భేటీ అయితే ఆ హడావిడిలోనే ఉండే ఆదాని నాలుగు గంటలపాటు జగన్ భేటీతో అవుతారా..? అన్నది అందరి నోటి నుంచి వస్తోన్న ప్రశ్న. ఈ ప్రశ్నకు వైసీపీ కూడా సమాధానం చెప్పడం లేదు.
ప్రస్తుతం అదాని గ్రూప్ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. హిండెన్ బర్గ్ నివేదిక తరువాత అదాని సంస్థలను కాపాడుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఏపీలోనూ జగన్ సహకారమందిస్తున్నారు. విశాఖలో విలువైన భూములను కేటాయించారు. తాజాగా మరోసారి జగన్ మద్దతును ఇవ్వాలని కోరేందుకు అదాని తాడేపల్లికి వచ్చారా..? ఏపీ నుంచి విస్తృత స్థాయిలో ప్రయోజనం ఆశించే ఆయన జగన్ తో భేటీ అయ్యారా.? అనే అనుమానాలు కల్గుతున్నాయి.
అదానితో భేటీని సర్కార్ సీక్రెట్ గా ఉంచడంతో ఈ అనుమానాలు మరింత రెట్టింపు అవుతున్నాయి. దీనిపై స్పష్టత ఇచ్చినా అది నమ్మశక్యంగా అనిపించడం లేదు. దీంతో అదానికి ఏపీని తాకట్టు పెడుతున్నారని విపక్షాలు మరోసారి దుమ్మెత్తిపోస్తున్నాయి.
Also Read : ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు