టి ఎస్ పి ఎస్ సి పేపర్ లీక్ దర్యాప్తులో సిట్ అధికారులకు మతిపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ చీఫ్ అధికారి, అడిషనల్ ఎస్ పి అయిన ఏ.ఆర్. శ్రీనివాస్ నేతృత్వంలో సైబరాబాద్ క్రైమ్ ఏసిపి అయిన కే.వి.ఎం. ప్రసాద్ తదితరులు గత రెండు రోజులుగా హైదరాబాద్ లోని హిమాయత్ నగర్లో ఉన్న సిట్ కార్యాలయంలో నిందుతులను విచారిస్తున్నారు.
నిన్న ఏడు గంటలపాటు విచారించారు. ఈ రోజు కూడా విచారిస్తున్నారు. నేరస్తులకు పట్టపగలే చుక్కలు చూపే సిట్ చీఫ్ అధికారి, అడిషనల్ ఎస్పి అయిన ఏ.ఆర్. శ్రీనివాస్ కే నిందితులు కొత్త కొత్త ట్విస్ట్ లు ఇచ్చి షాక్ ఇచ్చినట్లు తెలిసింది. ఇందులో ముఖ్యమైనది టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పేపర్ని కూడా నిందితులు అమ్మకానికి పెట్టినట్లు తెలిసింది. గురుకుల ఉద్యోగాల కోసం లోగడ నిర్వహించిన పరీక్షల విషయంలో కూడా ప్రవీణ్ రేణుకకు సహకరించినట్లు తెలిసింది. అసలు వీళ్ళ ఇద్దరిమధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి లోతుగా విచారణ మొదలు పెట్టారు.
ప్రవీణ్ కు ఇచ్చిన రూ. 10 లక్షలే కాకుండా, లీక్ చేసిన పేపర్లు అమ్మి మరో రూ. 15 ఇవ్వడానికి నిందితురాలు రేణుక ప్రయత్నించింది అని అధికారులు చెప్పారు. రేణుక ఏకంగా రెండు ప్రశ్నా పత్రాలు కొనేందుకు ప్రవీణ్ తో డీల్ చేసుకున్నదని తెలిసింది.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేకర్ రెడ్డి మొబైల్ ఫోన్ లో ఉన్న డేటా ఆధారంతో చాలా కొత్త విషయాలు తెలుసుకున్నారు అధికారులు. వీళ్ళతో పాటు మరో నిందితురాలు రేణుకను, ఆమె భర్త ధాన్యానాయక్, ఆమె సోదరుడు రాజేశ్వర్, ఇతర నిందితులు మొత్తం 9 మందిని విడివిడిగా విచారించారు. ఇపుడు కొందరిని కలిపి విచారిస్తున్నారు. ఎవరికి వారు విడిగా చెప్పినదానికి, గ్రూప్ లో చెప్పినదానికి కొన్ని విషయాలు పొంతన లేకుండా పోతోంది. అందుకే కేసును చాలా జాగ్రత్తగా పరిశోధిస్తున్నారు ఏ.ఆర్. శ్రీనివాస్.
రేణుక చెప్పిన ఆధారాలతో చూస్తే ఆమె ఏకంగా టి ఎస్ పి ఎస్ సి కోచింగ్ ఇచ్చే సెంటర్ లలో చదివే డబ్బున్న వాళ్లతో డీల్ కుదుర్చుకుంది అని తెలిసింది. ఇలాంటి కోచింగ్ సెంటర్లు హైదరాబాద్ లో అశోక్ నగర్, చిక్కడపల్లి, దిల్సుక్ నగర్, అమీర్ పేట్లో ఉన్నాయి.
రేణుక దగ్గర ప్రశ్నా పత్రాలను కొన్నవాళ్ళు తమ డబ్బు ను రికవరీ చేసుకోడానికి ఇతరులకు కూడా అమ్మి ఉంటారు అని అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే ఇంకా ఎంతమంది వీటిని కొన్నారో తేల్చడానికి పరీక్ష రాసిన వాళ్ళను కూడా విచారించాబోతున్నారు అధికారులు.