దేశం లోనే అతి పెద్దదయిన కాకతీయ మేఘా టెక్స్ టైల్ పార్క్ ను వరంగల్ లో ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. గీనుకొండ ప్రాంతంలోని 3 వేల ఎకరాలల్లోటెక్స్ టైల్ పార్క్ ను మొదలుపెట్టింది. దీనితోపాటు సిరిసిల్లా మేఘా టెక్స్ టైల్ పార్క్ ను ”పి ఏ.ఎమ్ మిత్ర పథకంలో” సిరిసిల్లా లో కూడా ఏర్పాటు చేయాలనీ కేటిఆర్ ప్రధాన మంత్రి మోడీని పలుమార్లు కోరారు.
మోడీ చేపట్టిన ‘పిఎమ్ మిత్ర పథకం’ కింద దేశం లోని ఎనిమిది రాష్టాలల్లో మేఘా టెక్స్ టైల్ పార్క్ లు ఏర్పాటు చేయాలనీ మోడీ నిర్ణయించారు. అయితే ఇందులో తెలంగాణ పేరును కూడా చేర్చి కేటిఆర్ కు శుభవార్త చెప్పారు. అయితే ఆ మేఘా టెక్స్ టైల్ పార్క్ ను వరంగల్ లో ఏర్పాటు చేస్తారా, లేకా సిరిసిల్లలో ఏర్పాటు చేస్తారో ఇంకా నిర్ణయించలేదు మోడీ. దీనిని సస్పెన్స్ లో పెట్టి అందరిలో టెన్షన్ కలిగేలా చేశారు.
దేశంలోనే కేవలం ఎనిమిది మేఘా టెక్స్ టైల్ పార్క్లలోంచి ఒకటి తెలంగాణకు రావడంలో కేటిఆర్ కృషి ఎంత ఉన్నదో, అంతే కృషి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ – టి ఎస్ ఐ ఐ సి) మేనేజిన్ డైరెక్టర్ ఈ. వి. నరసింహా రెడ్డి కూడా ఉన్నది. అతను ఆధునిక హంగులతో, అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేసిన మేఘా టెక్స్ టైల్ పార్క్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రధాని ప్రశంసలు పొందింది. దానికితోడు దేశంలోని మిగతా ఏడూ రాష్ట్రాలు దీనిని ఓ రోల్ మోడల్ గా చేసుకుని అమలు చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ఇంత బాగా రావడానికి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ సిఈఓ అయ్యిన వి మధసూధన్ లాంటి నిపుణుల కృషి కూడా ఇందులో ఉన్నదని ప్రశంసించారు నరసింహా రెడ్డి.
తెలంగాణ రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాలను అభివృద్ధికి కావలసిన మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంస్థ పేరే ‘తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ’. ఇది 2014లో ప్రారంభించబడింది. అప్పటినుంచి ఇలాంటి అనేక ప్రాజెక్టు లు తెలంగాణ కోసం తయారు చేసి, దేశానికే రోల్ మోడల్ గా మారింది.
ఈ పార్క్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ 300 కోట్లు ‘ప్రోత్సహవా మద్దత్తుగా’ ఇస్తుంది అని నరసింహా రెడ్డి చెప్పారు. కేంద్రం బడ్జెట్ లో రూ. 4,455 కోట్లు కేటాయించినట్లు అయన వివరించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని వివరించారు. అయితే ప్రధాని ఈ పార్క్ ను వరంగల్ కు ఇస్తారా లేకా సిరిసిల్లకు ఇస్తారో చూడాలి అన్నారు.