ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడీ షాక్ ఇచ్చింది. ఇటీవల ఈడీ విచారణపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కౌంటర్ గా ఈడీ కూడా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. కవిత విషయంలో ఎలాంటి ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని కోరుతూ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా ఈ కేసు విషయంలో ఎలాంటి తీర్పు ఇవ్వకూడదని ఈడీ కోరింది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మార్చి 11న కవిత ఈడీ విచారణకు హాజరైంది. ఆమెను తొమ్మిదిగంటలపాటు విచారించారు. ఆ తరువాత మరోసారి విచారణకు హాజరు కావాలంటూ కవితకు ఈడీ నోటిసులు పంపింది. కానీ ఆమె మాత్రం రెండోసారి విచారణకు హాజరుకాలేదు. ఈడీ తనను విచారించాలంటే ఇంటికి వచ్చి విచారణ చేసుకోవచ్చునని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ దర్యాప్తు ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే…కవిత దాఖలు చేసిన పిటిషన్ పై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. మార్చి 24న విచారణ చేపడుతామని తెలిపింది. దీంతో కవిత పిటిషన్ పై ఈడీ కేవియట్ పిటిషన్ వేసింది. ఈ కేసులో తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆర్డర్స్ పాస్ చేయవద్దని సుప్రీంకోర్టును కోరింది ఈడీ.
ఈ రెండు పిటిషన్లపై మార్చి 24న సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ పిటిషన్ 24న విచారణకు వస్తుండగా 20నే కవితను విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. కానీ కవిత మాత్రం సుప్రీంకోర్టులో విచారణ పూర్తైన తరువాతే విచారణకు హాజరు అవుతానని ఈడీకి లేఖ రాసి ఉండటంతో సోమవారం నాటి విచారణకు కవిత డుమ్మా కొట్టనున్నారు
రెండుసార్లు విచారణకు హాజరు కావాలని కోరితే కవిత డుమ్మా కొట్టడంతో నెక్స్ట్ ఈడీ ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. వారెంట్ జారీ చేసి కవితను అరెస్ట్ చేస్తుందా..? అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.ఎందుకంటే ఈ కేసులో ఈడీ చాలా దూకుడుగా ముందుకు వెళ్తోంది.కాబట్టి వారెంట్ జారీ చేసి కవితను అదుపులోకి తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.
Also Read : ఏపీలో అవినాష్ రెడ్డి…తెలంగాణలో కవిత – చెప్పేదేమంటే..?