అవును. ఈడి ఉన్నట్టుండి ఒక్కసారిగా దూకుడు పెంచింది. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఉన్న ప్రధాన సూత్రం దారులను, పాత్ర ధారులకు మరోసారి నోటిసులు పంపనుంది. ఇప్పటివరకు ‘నిందితులు’, ‘అనుమానితులు’ అనే రెండు కమిటిలతో విడివిడిగా విచారణలు జరిపింది. వాటికి రికార్డ్ చేసింది.
కానీ ఇప్పటివరకు ‘అనుమానితురాలు’ గా ఉన్న కవితను ఈ నెల 16 న విచారణకు రావాలని లోగడ ఈడి ఆదేశించంది. కానీ కవిత చాలా తెలివిగా తప్పించుకుని తన లాయర్ని పంపింది. పైగా మీరు పంపిన నోటిసులో ‘నేను వ్యక్తిగతంగా’ రావాలని ఎక్కాడా లేదనే లాజిక్ తో తప్పించుకుంది.
అందుకే ఈడి కి ఒళ్ళు మండింది. ఆమె ఎత్తుకు పై ఎత్తు వేయాలని మార్చ్ 20 మరోసారి విచారణకు ‘వ్యక్తిగతంగా’ రావాలని ఆదేశించింది. ఈ సారి కూడా ఆమె ఏదో ఒక వంకతో తప్పించుకోవచ్చు. అందుకే ఈసారి ‘నిందితులు’, ‘అనుమానితులు’ అనే రెండు కమిటిలను ఒకే చోట చేర్చి ‘జాయింట్ ఎంక్వైరీలు కమిటి’ వేసింది.
అంటే ఇక ‘నిందితులు’, ‘అనుమానితులు’ ఇద్దరు ఒకే గొడుగు కిందికి వస్తారు. అందరిని ఒకే చోట కూర్చోపెట్టి నిజాలు కక్కిస్తారు. ఈ దెబ్బతో కవిత మీద కొన్ని కొత్త ఆరోపణలు రాగానే ఆమెను అరెస్ట్ చేయడానికి రంగం సిద్దమయ్యింది. ఏ కోణంలో చూసినా ఆమె తప్పించుకునే ఆశలు సన్నగిల్లు తున్నాయి. పొతే బిజెపి అధిష్టానం చివరి నిముషంలో కొత్త ట్విస్ట్ ఇస్తే తప్ప కవిత అరెస్ట్ ఆగుతుంది.