ఎల్లమ్మ కూడబెడుతుంటే మైసమ్మ మాయం చేసింది అనే సామెత ఉంది. ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్ పి. వి సింధు, ప్రపంచ బాక్సర్ ఛాంపియన్ నిఖాట్ జారీన్ లాంటి బిడ్డలు తెలంగాణ పేరును ప్రపంచం నలుదిశలా మారుమోగేలా చేస్తున్నారు. మనకు, మన మహిళా జాతికే గర్వకారణం అయ్యారు. ఇదే గడ్డ మీద పుట్టిన మరి కొందరు మహిళలు ఆ పేరు ప్రతిష్టలను సర్వనాశనం చేస్తున్నారు.
వాళ్లు నేరాలు చేశారా లేదా అన్నది తరువాతి విషయం. కానీ మనకు వచ్చిన పేరు ప్రతిష్టలు దిగజారి పోయేలా యావత్తు దేశం నవ్వుకునేలా చేస్తున్నారు. తెలంగాణ మహిళలు పెద్ద ‘కరోడాలు’, ‘ళ్ళు దేనికైనా సిద్దహస్తులు’ అనే అప్రతిష్టపాలు చేస్తున్నారు. అవినీతి కేసులల్లో పోటీపడి ఇరుక్కున్నారు.
మనం సాధించుకున్న తెలంగాణ ఇదేనా? సిగ్గుతో తలవంచుకునేలా చేస్తున్నారు. ఆ వీర’అవినీతి’ పరులు టాప్ టెన్ లో ఈ నలుగురు ప్రముఖంగా ఉన్నారు.
ఎమ్మెల్సి కవిత
కాకులు అంటే తెలియనివాళ్ళు ఉండవచ్చు. కానీ ఎమ్మెల్సి కవిత అంటే తెలియని తెలంగాణ వాళ్లు లేరు. తెలంగాణ సాధించి పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ముద్దుల కూతురు. పుట్టుకతో పేదరికం అంటే ఏమిటో తెలియదు. డబ్బు మీద వ్యామోహం ఉన్నదో లేదో తెలియదు, కానీ పదవి మీద వ్యామోహం మాత్రం ఎక్కువా. ఓసారి ఎంపిగా గెలిచి, మరోసారి ఓడిపోయింది. ప్రజాదరణ తగ్గిపోగానే తండ్రి అండదండలతో ఎమ్మెల్సిగా మారింది. ఆక్సిజన్ లేకుండా బతకగలదు. కానీ పదవి లేకండా బతకలేదు.
కవిత తెలంగాణాకు చేసిన సేవ శూన్యం. దసరా పండగ వస్తే మాత్రం ‘అంతా నేనే’ అన్నట్లు అన్ని జిల్లాలల్లో బతుకమ్మ ఆడి, పేపర్లల్లో నానుతుంది. దానినే ప్రజాసేవ అనుకుంటుంది.
ఆమె ఏ పని చేసినా కెసిఆర్ ని బుల్లెట్ ప్రూఫ్ వాహనంలా వాడుకుంటుంది. ఆమె ఏ షాప్ ఓపనింగ్ కు వెళ్ళినా డబ్బులు డిమాండ్ చేస్తుంది అనే టాక్ ఉంది. అందుకే ఆమెను పిలవడం మానుకున్నారు జనం. ‘న్యూ ఢిల్లీ లిక్కర్ స్కాం’లో తనంకు ఎలాంటి సంబంధం లేదు అని ఆమె మొదట్లో బల్లగుడ్డి వాదించింది. కానీ ఆమె ఇప్పుడు ఆ బల్ల ముందు నిలబడింది. ఆ కేసులో ప్రధాన అనుమానితురాలుగ మారింది.
సిఐడి, ఈడి ల విచారణలో ఏ మాత్రం సహకరించకుండా దాటవేసే ధోరణ్తితో వ్యవహరిస్తోంది. కానీ తాను నిర్దోషిని అని రుజువు చేసుకూడానికి మాత్రం ప్రయత్నించడం లేదు.
ఈ కేసులో ఆమె హస్తం ఉందో లేదో ఇప్పటివరకు తెలియదు. కానీ ఆమె ప్రవర్తన మాత్రం ఆమె హస్తం కూడా ఉండవచ్చు అనే అనుమానాలు కలిగిస్తున్నాయి. పోలీసు రాగానే ఒకడు గోడ చాటున నక్కితే, ఖచ్చితంగా వాడే దొంగా అనే అనుమానం ముందు మనకు కలుగుతుంది. ఇప్పుడు కవిత పరిస్టితి కూడా అదే.
నోరు తెరిస్తే ‘బిజెపి కుట్ర పూరితంగా ఈ కేసులో తనను ఇరికించింది’ అని చిలకపలుకులు పలుకుతుంది. అదే నిజమైతే మంచి దూకుడు మీద ఉన్న కెసిఆర్ ని లేదా కే టి ఆర్ ని ఇకిస్తారు. బతుకమ్మ ఆడుతూ తిరిగే కవితను ఎందుకు ఇరికిస్తారు? ఆమెను ఇరికించినా వాళ్ళకు ఒరిగేది ఏముంది?
మొత్తానికి బిఆర్ఎస్ పార్టీని జాతీయ స్టాయికి తీసుకెళ్లాలని కెసిఆర్ చూస్తుంటే, ఆదిలోనే హంసపాదు అన్నట్లు కవిత నెగిటివ్ సంకేతాలు దేశానికి పంపి పార్టీ భవిష్యత్తుకే తూట్లు పొడిచింది. ఈమెకు పోటిగా మరో ముగ్గురు తయారయ్యారు.
టి ఎస్ పి ఎస్ సి రేణుక
మగవాడి బలహీనత సెక్స్. ఈ నాడి పట్టుకున్న రేణుక అనే సగటు మహిళ టి ఎస్ పి ఎస్ సిలో ఉద్యోగం చేసున్న ప్రవీణ్ అనే కామాంధుడిని వలలో వేసుకుంది. టి ఎస్ పి ఎస్ సి ప్రశ్నా పత్రాన్ని లీక్ చేసి ఇస్తే స్వర్గం చూపిస్తాను అని కవ్వించింది. అతను రిస్క్ చేశాడు. దానిని ఆమె బ్లాక్ లో అమ్ముకుని లక్షలు నొక్కేసింది. ఈ అమ్మడు అతనికి నిజంగానే స్వర్గం చూపింది. అడ్డంగా దొరికింది. ఇప్పుడు నరకం చవిచుస్తోంది.
నిహారిక
నిహారికది ఇంకా ఎదిగి ఎదగని వయసు. డిగ్రీ చేస్తోంది. నవీన్ అనే కుర్రాడిని ప్రేమించినట్లు నటించింది. అతనితో డేటింగ్ చేసింది. ఆమె సుఖ పడింది. అతనిని సుఖపెట్టింది. ఆ తరువాత ఆమె కన్ను నవీన్ స్నేహితుడు హరిహర కృష్ణ మీద పడింది. అతనిని కూడా ప్రేమించినట్లు నటించినిది. అతనితో కూడా డేటింగ్ చేసింది. ఆమె సుఖ పడింది. అతనిని సుఖపెట్టింది.
ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చుకు కారణం అయ్యింది. ఇద్దరు తన్నుకు చావడానికి భీజం వేసింది. నవీన్ని అతి కిరాతకంగా హరిహర కృష్ణ చంపాడు. ఆ శవం ఫోలు ఆమె చూసింది. కానీ తన ప్రియుడు చనిపోయాడు అని ఏడవలేదు. పీడవిరగడయ్యింది అని సంతోషించింది. ఈ విషయం పోలీసులకు తెలియకుండా జాగ్రత్త పడింది. ఇప్పుడు అడ్డంగా చట్టానికి దొరికింది.
సర్పంచ్ నవ్య కొత్త కోణం
బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ నవ్య ను అదే పార్టీకి చెందిన ఎమ్మేలే తాడికొండ రాజయ్య లైంగికంగా వేధించాడు అని ఆమె ప్రెస్ ముందు చెప్పి సంచలనం రేపింది. ప్రెస్, మహిళా సంఘాలు ఆమెను మెచ్చుకుని రాజయ్యను తిట్టారు. ఆమె సింపతి పొందింది.
కానీ లోతుకు వెళ్ళితే సిట్టింగ్ ఎమ్మేల్లె, మాజీ ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి హస్తం ఉన్నదనే పుకార్లు కొత్త ట్విస్ట్ ఇచ్చాయి. రాజయ్యను రాజకీయంగా దెబ్బ కొట్టడానికే నవ్య శ్రీహరితో చేతులు కలిపినట్లు వదంతులు రావడంతో ఇప్పుడు ఆమె కూడా నెగిటివ్ వైరల్ వార్త గా మారారు. ఇలాంటి మహిళలు మరెందరో…