కోతిని తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోపెడితే, ముందుగా అది ఆ సింహాసనం మీదున్న పట్టు గుడ్డను చించుతుంది. అందులో ఉన్న దూదిని పీకి పైకి పీకి చిందులు వేస్తుంది. రామ్ గోపాల్ వర్మ లాంటి కోతిని తీసుకు వచ్చి 50 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న నాగార్జున యూనివర్సిటీ సభలో మైక్ ముందు నిలుచోపెడితే బూతులు రాక రామకృష్ణ పరమహంస నీతులు వస్తాయా?
నాగార్జున యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ బుద్ది గడ్డితిని రామ్ గోపాల్ వర్మను ఓ కార్యక్రమానికి పిలిచి విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెప్పమని కోరాడు. వాళ్ళల్లో కొత్త ప్రేరణం కలిగించ మని వేడుకున్నాడు. అలాగే అని తల ఊపిన వర్మ మైక్ అందుకోగానే తన స్టైల్ లో రెచ్చిపోయి, విద్యార్థులను రెచ్చగొట్టే లెక్చర్ దంచాడు.
మొదటగా చెప్పింది అతను ఇష్టపడే సెక్స్ గురించే. సెక్స్ తప్పు కాదు అనీ, మీకు నచ్చిన వాళ్లతో కులకమని చక్కగా హితబోధ చేశాడు. అసలు సెక్స్ నేరం అయితే మనం ఎలా పుట్టాము? అని అందరిని నిలదీసి నవ్వించాడు. మనం పుణ్యకార్యాలు చేస్తే చనిపోయాకా స్వర్గానికి వెళతాము అంటారు. ఆ స్వర్గంలో రంభా, ఊర్వశి, మేనకలు అనే అందెగత్తేలు ఉంటారు, వాళ్లతో ఎంజాయ్ చేయవచ్చు అని ఊరిస్తారు చెపుతారు.
అంత కష్టపడి పుణ్యం చేయడం ఎందుకు? అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేయడం ఎందుకు? అసలు వాళ్లు ఉన్నారో లేరో ఎవడు చూశాడు? అదేదో ఇక్కడే రంభా, ఊర్వశి, మేనకలాంటి ఐటం గర్ల్స్ తో ఎంజాయ్ చేయవచ్చుకదా? అని అన్నాడు. జీవితం అంటేనే ఎంజాయ్ చేయడం. ముందు లైఫ్ ని ఎంజాయ్ చేయడం నేర్చుకోండి అని అందరిని రెచ్చగొట్టాడు.
లెక్చర్లు చెప్పింది వింటే జీవితం చంకనాకి పోతుంది. కాబట్టి వాళ్ళ నీతులు పట్టించుకోకుండా నచ్చింది తినండి, నచ్చింది తాగండి, నచ్చిన వాళ్లతో తిరగండి. ఈ జీవితం మీది అని చక్కగా హితబోధ చేశాడు గురుడు.
నేను అందగాడిని కాదు. కానీ నేను అందగాడిని అని అమ్మాయిలు భావించాలి అంటే, ప్రపంచంలో ఉన్న మగాళ్ళు అందరు చనిపోవాలి. నేను ఒక్కడినే బతకాలి. అప్పుడు అమ్మాయిలు నన్ను అందగాడిగా భావిసారు అని వివాద స్పద వాఖ్యలు చేశాడు.
ఈ మాటలు వైరల్ కాగా అందరు వైస్-ఛాన్స్లర్ని దుమ్మెతి పోస్తున్నారు. సెక్స్ సినిమాలు తీసుకునే రామ్ గోపాల్ వర్మను విశ్వవిద్యాలయానికి పిలవడం ఏమిటని టిడిపి, జనసేన నాయకులు మండిపడుతున్నారు. ఇది చిలికి చిలికి గాలివానగా మారింది. రాజకీయం రంగు, బికినీ వేసుకుంది. చివరికి విసి ని బదిలీ చేయాలి అనే స్టాయికి వెళ్ళింది. ఈ కేసు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వరకు వెళ్ళింది.
ఇప్పుడు జగన్ గొప్ప ఇరకాటంలో పడ్డారు. ఎందుకంటే వర్మ వైసీపీకి అనుకూలంగా ‘వ్యూహం’, ‘శపథం’ అనే రెండు సినిమాలను తీస్తున్నాడు. ఈ సినిమాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు విడుదలవుతాయి. కాగా గత ఎన్నికల సమయంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లాంటి సినిమాలు తీసిన రాంగోపాల్ వర్మ టీడీపీని చావు దెబ్బకొట్టాడు. ఇప్పుడు వర్మను కెలికితే ఏకంగా జగన్ని విలన్ గా చేసి, ఇప్పుడు తీసే ‘వ్యూహం’ ‘శపథం’ సినిమాలను తెరకు ఎక్కించినా ఆశ్చర్యం లేదు. అందుకే జగన్ తేలుకుట్టిన దొంగలా ఊరుకున్నారు.