టీఎస్ పీస్సీ పేపర్ లీక్ కావడంతో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీఎస్ పీస్సీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలన్నీ దాదాపు లీక్ అయినట్లు అనుమానాలు వస్తుండగా ఓ కొత్త వార్త సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఏఈ ,టౌన్ ప్లానింగ్ పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు రాగా… గతంలోనూ టీఎస్ పీస్సీ పేపర్ లీక్ అయినట్లు సమాచారం. అయితే ఈ పేపర్ లీక్ విషయాన్ని బయటకు రాకుండా తొక్కిపెట్టారనే వార్త ఒకటి ప్రకంపనలు రేపుతోంది.
2011లో నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయంలో విడుదల చేసిన గ్రూప్ 1పరీక్షను తెలంగాణ ఏర్పడిన తరువాత 2016లో రీ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ పేపర్ కూడా లీక్ అయిందని… ఇందులో నాడు ఎంపీగానున్న ప్రస్తుత ఎమ్మెల్సీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్నాయి.
23మంది నిజామాబాద్ కు చెందిన కవిత మనుషులు గ్రూప్ 1ఎగ్జామ్ రాశారు. కవిత అనుచరులైన ఈ 23మంది ఒకే సెంటర్ లో పరీక్షను రాశారని…ఈ పరీక్షకు హాజరైన 23మంది క్వాలి ఫై అయ్యేలా సహకరం అందిందని… దీనిని బయటపెట్టేందుకు ఓ రిటైర్డ్ పొలిసు ఆఫీసర్ సిద్దంగా ఉన్నట్లు జర్నలిస్ట్ విఠల్ వెల్లడించారు. ఈ వ్యవహారంలో కవిత ప్రమేయం ఉన్నట్లు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని… సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే ఈ ఆధారాలను బయటపెట్టేందుకు సిద్దంగా ఉన్నామని వెల్లడించారు. కవిత తన సచ్చీలతను నిరూపించుకోవాలంటే జ్యూడిషియల్ ఎంక్వయిరీకి ఆదేశించాలని సవాల్ విసిరారు. అవినీతికి పాల్పడితే కుటుంబ సభ్యులను కూడా వదలను. అవినీతి ఆరోపణలపై విచారణ చేయిస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేసీఆర్…40లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించిన ఈ అంశంలో కవితపై విచారణకు ఆదేశిస్తారా..? అన్నది చూడాలి.
జర్నలిస్ట్ విఠల్ ఈ విషయాన్ని బయటపెట్టగానే సోషల్ మీడియాలో కింది వార్త వైరల్ అవుతోంది.
రజినీకాంత్ రెడ్డి అనే వ్యక్తి టీఎస్ పీఎస్సీలో జూనియర్ అసిస్టెంట్. నిబంధనల ప్రకారం అతను టీఎస్ పీస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ రాయకూడదు. కానీ ఒక్క రోజు కూడా లీవ్ పెట్టకుండానే 4వ ర్యాంక్ సాధించాడు. అప్పుడు ఎగ్జామ్ రాసి సెలక్ట్ అయిన అతికొద్ది మందికి మాత్రమే ఈ విషయం తెలుసు. కానీ ఆన్సర్ షీట్ నుండి మార్కులు కోడింగ్ చేసే క్రమంలో టాప్ టెన్ లో ఉండే విధంగా అతను మార్కులు వేసుకున్నాడు. బదులుగా కవితకు చెందిన అభ్యర్థులు 23 మంది ఒకే సెంటర్ లో గ్రూప్ 1 రాసిన అభ్యర్థులకు పోస్ట్ వచ్చే విధంగా మర్క్స్ కోడింగ్ లో అక్రమాలకి పాల్పడ్డాడనే వార్త వైరల్ అవుతోంది.
మాధురి : (ప్రస్తుతం ఆర్డీవో )
ఈమె అమెరికా నుంచి వచ్చి ఎగ్జామ్ రాసింది. మొదటి ర్యాంక్ కోసం దాదాపు కోటి రూపాయలు సమర్పించినట్లు సమాచారం. సాధారణంగా గ్రూప్ 1మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ కలిపితే 500మార్కులు వస్తే మహా ఎక్కువ. అలాంటిది ఈమెకు మాత్రం ఏకంగా 520మార్కులు వచ్చాయి. మొదటి ర్యాంక్ కోసమే అదనపు మార్కులు వేసినట్లు పుకార్లు వస్తున్నాయి. దీని వెనక ఎవరున్నారో తేలాలి.
ఉదయ్ కుమార్ రెడ్డి రెండో ర్యాంక్ (ప్రస్తుతం ASP)
ఈయన కూడా మొదటి ర్యాంక్ కోసం ఓ టీఆర్ఎస్ బడా నేతకు 50లక్షలు సమర్పించుకున్నాడట. మొదటి ర్యాంక్ మాధురికి రావడంతో ఈయనగారు ఆగ్రహంతో టీఆర్ఎస్ నేతతో గొడవ కూడా పెట్టుకున్నాడట. కానీ విషయం పెద్దగా మారితే అసలు విషయం విషయం బయటకు వస్తుందని కాంప్రమైజ్ అయినట్లు చెబుతున్నారు.
పై ముగ్గురు మరియు ఆ 23మంది జవాబు పత్రాలు మరియు వాళ్ళకి వచ్చిన మార్కులు పరిశీలిస్తే నిజాలు బయటపడతాయి.ఆ మెయిన్స్ కు సంబంధించి రెండు కేసులు హై కోర్ట్ లో వున్నావాటిని బెంచ్ మీదకు రాకుండా చేస్తోంది.ఇప్పుడు ప్రవీణ్ దొరికిపోయాడు. రజనీకాంత్ రెడ్డి దొరకకుండా దర్జాగా గ్రూప్ 1 ఉద్యోగం హైదరాబాద్ లో చేస్తున్నాడు. అంతే తేడా.
Also Read : టీఎస్పీఎస్సీ లీకేజీ : అసలేం ఏం జరుగుతోంది -పోలీసులు ఒకలా…టీఎస్పీఎస్సీ చైర్మన్ మరోలా..!