నిన్న, అంటే మార్చ్ 16 న ఈడి విచారణ తర్వాత ఎమ్మెల్సి కవిత తప్పక అరెస్ట్ అవుతారు అని మొత్తం తెలుగు ప్రజానీకంతోపాటు యావత్తు దేశం కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూసింది. ఉదయం పది గంటల ముప్పయి నిముషాలకు ఆమె ఈడి కార్యాలయానికి వస్తారు అని ప్రెస్ పడిగాపులు కాసింది. ఈడితోపాటు ఇతర నిందితులు కూడా కార్యాలయం లోపల ఎదురు చూశారు. కానీ ఎవ్వరు ఊహించని విధంగా ఆమె హాజరు కాకుండా తన లాయర్ని పంపి జంప్ జిలాని లా తప్పించుకున్నారు.
కవిత ఓ కుంటిసాకు చూపడం చాలా బాధాకరం. మీరు పంపిన నోటిసులో ఈ నెల 16న గ్రూప్ విచారణ ఉన్నదని ఆదేశించారు, కానీ అందులో ‘నేను వ్యక్తిగతంగా పాల్గోనాలి’ అని రాయలేదు. కావున నా తరపున నా లాయర్ని పంపుతున్నారు అని చాలా తెలివిగా ఈడి అధికారులకు ఆమె జవాబు ఇచ్చారు. ‘నన్ను పేరంటానికి పిలిచారు, కానీ బొట్టు పెట్టి పిలవలేదు. కావున రాలేకపోతున్నాను’ అన్న చందనంగా లేదూ?
సామాన్యంగా ఈడి పంపే నోటిసులులో అందరికి ఇలాగే రాస్తారు. అంతకు ముందు ఆమెకు పంపిన నోటిసులో కూడా ఇలాగే రాశారు. మరి మొన్న మార్చ్ 11 న లేవనెత్తని ఈ లాజిక్ ని ఈ రోజు ఎందుకు లేవనెత్తారు? ఇదే లాజిక్ తో ఆమె మొన్న కూడా డుమ్మా కొట్టవచ్చుగా? మొన్న లేని లాజిక్ ఈ రోజు ఎందుకు వచ్చింది?
ఎందుకంటే మొన్న ఈడి చేపట్టిన మొదటి విచారణలో ఆమెను అడిగిన 20 ప్రశ్నలకు ఏ ఒక్కదానికి సరైన సమాధానం చెప్పలేదు అని తెలిసింది. అంటే ఆమె తన నేరం నుంచి తప్పించుకునే ధోరణిలో ఉన్నారు. కానీ తాను నిర్దోషిని అని నిరూపించుకునే ధోరణిలో లేరు. రెండోసారి ఈడి విచారణలో పొరపాటున ఆమె దొరికితే అరెస్ట్ తప్పనిసరి. ఒక్కసారి అరెస్ట్ అయితే కటకటాలపాలు కాకతప్పదు. అందుకే ఆమె తెలివిగా సుప్రీం కోర్ట్ లో ఈడి మీదనే కేసు వేసింది. ముందు ఈడి నుంచి తప్పించుకుని కోర్టులో ఏళ్ల తరబడి తన కేసును నాన్చవచ్చు అన్నది ఆమె ప్లాన్ అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కనీసం వచ్చే ఎన్నికలవరకు ఈ కేసును లాగాలని ఆమె ఆరాటం.
ఇది చూస్తుంటే మన దేశంలో 1952 లో జరిగిన ఓ ఉరిశిక్ష కేసు గుర్తుకు వస్తోంది. ఓ నేరస్తుడిని ఉరి తీయాలని కోర్టు ఆదేశాలు జారి చేసింది. అందులో ‘హాంగ్ హిమ్’ అని రాసుంది. అతనిని జైలర్ ఉరి తీయాలని మెడకు తాడు బిగించి, అతని కాళ్ళ కింద ఉండే బల్లను లాగారు. పొరపాటున ఆ ఉరితాడు తెగి, అతను గోతిలో పడి బతికాడు. జైలర్ మరోసారి ఉరి తీయబోతే అతను ఒప్పుకోలేదు.
‘మీరు నన్ను ఉరి తీశారు. కానీ అదృష్టవశాత్తు నేను బతికాను. నన్ను రెండోసారి ఉరి తీసే హక్కు మీకు లేదు’ అనే ఓ దిక్కుమాలిన లాజిక్ తో కోర్ట్ లో దావా వేశాడు. అప్పటినుంచి కోర్ట్ తన జడ్జిమెంట్ లో ‘హాంగ్ అప్ టు డెత్’ అని రాయడం మొదలు పెట్టింది. అంటే ‘చనిపోయేవరకు ఉరి తీయాలి’ అని అర్థం. కవిత కూడా అలాంటి లాజిక్ పట్టుకుడి.
ఇలాంటి కుంటిసాకులు ఆమె నేర ప్రవృత్తిని బయటపెడుతున్నాయి. కానీ ఆమె నిర్దోషి అనే సంకేతాలను సమాజానికి వెళ్ళడం లేదు. ఆమె ఈ కేసును ఎంత లాగిస్తే ఆమెకే అంత చెడ్డపేరు వస్తుంది అనే చిన్న లాజిక్ ని మరిచారు.