ఎవరూ కావాలని వ్యభిచార రొంపిలో చేరరు. ఏదో సమస్య వలన దాని నుంచి బయటపడేందుకు ఈ వృత్తిని ఎంచుకుంటున్నారు. కాల్ బాయ్స్ , వేశ్యలను ఒక్కసారి కలిసి మాట్లాడితే… జీవితంలో ఎదురైనా సంక్షోభ కాలం నుంచి బయటపడేందుకు దీనిని ఉపాధిగా మార్చుకున్నామని ఎక్కువగా చెప్తుంటారు. ఏం చేయాలో తెలియక భవిష్యత్ వెతుకులాటలో ఈ వృత్తి ఉపాధిగా మారిందని చెప్పడం చూస్తుంటాం. ఒక్కొక్కరిది ఒక్కో వేదన. ఎవరిని కదిలించిన మొండిగా దూకే కన్నీళ్ళే సమాధానం చెబుతాయి. ఈ క్రమంలోనే ఓ యువకుడు తాను కాల్ బాయ్ గా మారడానికి గల కారణాలను ఓ పత్రికకు వివరించాడు. అదేంటో చూద్దాం.
జీవితం నిండా చీకటి పేరుకుపోయింది. అంత శూన్యం. ఉపాధికి ఎలాంటి మార్గాలు లేవు. భవిష్యత్ కోసం ఎన్నో కళలు కన్నాను. కానీ కుటుంబ సమస్యలు నన్ను తీవ్ర అగాధంలోకి నేట్టేశాయి. ఈ క్రమంలోనే ఓ చోట నిలబడ్డాను. అప్పుడే ఓ ట్రాన్స్ జెండర్ నువ్వు ఎక్కడ నిల్చున్నావో తెలుసా..? ఇది శరీరంతో వ్యాపారాలు జరిగే చోటని గట్టిగా హెచ్చరించింది. నేను మగవాణ్ణి, రంగురంగుల బల్బులు వెలుగుతున్న చోట నన్ను నేనే అమ్ముకోవడానికి నిలబడ్డాను అని ఆ యువకుడు సమాధానం ఇచ్చాడు.
ప్రస్తుతం నాకు డబ్బు అత్యవసరం. డబ్బు కోసం ఏదైనా చేస్తానని సమాధానం చెప్పగానే అతని ఎదురుగానున్న ట్రాన్స్ జెండర్ అదోలా చూసింది. నీలో చాలా పొగరు ఉంది.. అది ఇక్కడ పని చేయదని చెప్పింది. అలా శరీరాన్ని అమ్ముకోవడానికి సిద్దపడినప్పుడు నాలో అంతర్మథనం. ఎలాంటి కుటుంబం నుంచి వచ్చాను నేను. అలాంటి నేను ఇలాంటి పని చేసేందుకు ముందుకు రావడం ఏంటని పరిపరివిదాలా ప్రశ్నించుకున్నాను. కానీ నా అవసరాలు నన్ను అలా మార్చేశాయి.
నా పరిస్థితిని అర్ధం చేసుకున్న ట్రాన్స్ జెండర్… నీ ఫోటోలు పంపాలి. లేకపోతే నీతో ఇక్కడ ఎవరూ మాట్లాడరని అంది. అప్పుడు నాలో మళ్ళీ భయం. ఈ ఫోటోలు మా కుటుంబ సభ్యులు ఎవరైనా చూస్తె కుటుంబ పరువు ఏమైపోతుంది..?అని భయం..బాధ వేధించింది. ఆ ట్రాన్స్‌జెండర్ వ్యక్తి కుడి, ఎడమ, ముందు నుంచి నా ఫొటోలు తీసుకుంది. ఆ ఫోటోలను వాట్సప్ ద్వారా ఎవరికో పంపింది. కొత్త సరకు. రేట్ ఎక్కువని ఎవరికో ఫోన్ లో మెసేజ్ చేసింది.
నా మీద బేరం ప్రారంభమైంది. ఎనిమిది వేల నుంచి మొదలై ఐదు వేలకు బేరం కుదిరింది. నా రేట్ ఫిక్స్ కావడంతో నేను ఓ టాక్సీలో కోల్ కత్తాలోని రిచెస్ట్ ఏరియాలోని ఓ ఇంట్లోకి ప్రవేశించాను. ఆ ఇల్లు చూడటానికి మామూలుగా లేదు.
ఇంద్రభవనంలా ఉంది. అక్కడ 32-34ఏళ్ల మధ్య వివాహిత. ఆమె నాతో మాట్లాడటం స్టార్ట్ చేసింది. నా భర్త ఒక గే. అతను అమెరికాలో ఉంటాడు. అతని వల్ల ఏమి కాదు. విడాకులు తీసుకోలేను. విడాకులు తీసుకున్న స్త్రీని ఎవరూ పెళ్లి చేసుకుంటారు..? అందరిలాగే మాకు కోరికలు ఉంటాయని చెబుతూ… మందు ఇచ్చింది. ఇద్డరం కలిసి మందు కొట్టాం. గది నుండి బెడ్‌రూమ్‌కి వెళ్ళాము.అప్పటివరకు నాతో ప్రేమతో , ఆప్యాయంగా పలకరించిన ఆమె… పని పూర్తి కాగానే చేసుకున్న ఒప్పందం ప్రకారం డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి పంపించేసింది. నా పని నచ్చి టిప్ కూడా ఇచ్చింది.
కోల్ కత్తా కు వంద కి. మీ దూరంలో ఉన్న నా ఇంటి వద్ద కష్టాలు మొదలు అయ్యాయి. మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నేను పుట్టాక మా నాన్న ఉద్యోగం పోయింది. ఎంబీఏ చేయాలన్న నా కల కల్లగానే మారింది. కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఇంజినీరింగ్ చేయాల్సి వచ్చింది. కోల్ కత్తాలో ఉద్యోగం వచ్చింది. కానీ అ డబ్బులు వేటికి సరిపోలేదు. దాంతో నేను ఇంటర్నెట్ లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను.
ఇంటర్నెట్ నాకు మేల్ ఎస్కార్ట్ , జిగోలో కావడానికి మార్గం చూపింది. జిగోలోల కోసం కొన్ని వెబ్ సైట్లు కూడా ఉన్నాయి. మొదట నా వివరాలు అందులో పెట్టడానికి భయపడ్డాను. కానీ అవసరం కదా. తప్పలేదు. అలా చివరికి నా ప్రొఫైల్ ను అందులో అప్లోడ్ చేశాను. నేను కలుసుకున్న స్త్రీలలో వితంతు మహిళలు, విడాకులు పొందిన వారు, ఒంటరి మహిళలు ఉన్నారు. వాళ్ళలో ఎక్కువగా అందరూ నన్ను ఓ యంత్రంగానే చూసేవారు. బెడ్ రూమ్ వెళ్ళకముందు ఆప్యాయంగా మాట్లాడుతారు. ఆ తరువాత పని పూర్తి కాగానే డబ్బులిచ్చేసి ఇక్కడి నుంచి దొబ్బెయ్ అంటూ మాట్లాడుతారు.
ఈ పనిలో 50ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్న మహిళా కూడా ఒకరు పరిచయమయ్యారు. నా జీవితంలో నాకు కండ్లు తెరిపించిన పరిచయం ఆమెది. నైట్ అంతా ఆమె నన్ను’ బాబూ.. బాబూ అంటూ మాట్లాడింది. చివర్లో ఈ పని త్వరగా వదిలేయ్ బాబూ అంటూ చెప్పింది. ఉదయం బయల్దేరుతున్నప్పుడు నాకు డబ్బు ఇచ్చి పంపిస్తుంటే… ఎందుకో దుఖం ఆగలేదు. అలా ఓ రోజు నేను చేస్తోన్న పని మీద నాకే అసహ్యం వేసింది. ఫుల్ గా మందు కొట్టేసి మా అమ్మకు ఫోన్ చేశాను. నేను ఇంత డబ్బు ఇంటికి ఎలా పంపుతున్నానో తెలుసా..? వ్యభిచారం చేయడం వల్లే అని నిజం చెప్పాను.
అప్పుడు మా అమ్మ ‘ నోరు మూయి వెధవ.. తాగి నోటికి ఎంతోస్తే అంత మాట్లాడుతావా అంటూ ఫోన్ పెట్టేసింది. మా అమ్మకు నిజం చెప్పినా నమ్మలేదు. ఆ రోజంతా ఏడ్చాను. తాగింది ఎక్కలేదు..నాలో నేను బాధపడిన సమయమది. నేను ఎంచుకున్న ఈ వ్యాపారంలో కొత్త అనుభవాలు.. కొత్త వ్యక్తులు. నా శరీరం మీద వాళ్ళ గుర్తులు వదిలి వెళ్లారు. నా బాధను ఎవరూ అర్థం చేసుకోలేరు. చాలా రోజుల తర్వాత నేను ఎంబీయే పూర్తి చేసి, కోల్‌కతాకు దూరంగా మరో నగరంలో ఒక మంచి ఉద్యోగంలో చేరాను.
Also Read : హైదరాబాద్ లో కాల్ బాయ్స్ కు ఫుల్ డిమాండ్ – ఈ ఏజ్ వారిని బుక్ చేసుకుంటున్న మహిళలు