నాడు ఆడదాని కోసం యుద్దాలు; నేడు ఆడదానికోసం స్కాం లు?
ఒక చిన్న హోల్ మొత్తం పడవనే ముంచుతుంది అన్నది ఓ సామెత. అలాగే ఒక ఆడదాని మీది చిన్న వ్యామోహం జీవితాలనే నట్టేట ముంచుతుంది. నాడు పాంచాలి కోసం మహాభారతం పుట్టింది. కురుక్షేత్రంలో లక్షలాది మంది చనిపోయారు. సీత కోసం రామాయణం పుట్టింది. రాముడి బాణాలకు లక్షల మంది మరణించారు అని చెపుతారు. అవి ఎంతవరకు నిజమో, కానీ నేడు జరిగిన రెండు సంఘటనలు అవి నిజమే అనిపించేలా చేసాయి.
ఓ ఆడదాని కోసమే టి ఎస్ పి ఎస్ సి పరీక్షా పేపర్ లీక్?
టి ఎస్ పి ఎస్ సి ఉద్యోగి ప్రవీణ్ పెద్ద ‘కాట్రాజు’. నచ్చిన అమ్మయి కోసం ఏ నేరానికైనా సిద్దం. ఆ విషయం మహబూబ్ నగర్ జిల్లాలోని పంచగల్ తండాకు చెందిన రేణుకకు తెలిసింది. ఆమె గొప్ప అన్దేగత్తే కాకపోయినా మంచి కండ పుష్టితో ఉంటుంది. ఆమె కావాలని ప్రవీణ్ తో పరిచయం పెంచుకుంది. ఆమె భర్త దక్యా నాయక్, సోదరుడు రాజేశ్వర్ నాయక్ లను కూడా పరిచయం చేయించింది. నలుగురు మంచి స్నేహితులుగా మారారు.
చపల బుద్ది ఉన్న ప్రవీణ్ ఆమెను గోకడానికి చూశాడు. ఆమె ఒప్పుకున్నట్లే ఒప్పుకుని ఓ కండిషన్ పెట్టింది. టి ఎస్ పి ఎస్ సి పరీక్షా పేపర్ లీక్ చేసి ఇస్తే, అతని కోరిక తీరుస్తాను అని ఊరించింది. మొదట్లో అతను ఒప్పుకోలేదు. కానీ తర్వాత రిస్క్ చేశాడు. పెన్ డ్రైవ్ లో మార్చ్ 2 న, టి ఎస్ పి ఎస్ సి పరీక్షా పేపర్ డౌన్ లోడ్ చేసి ఆమెకు ఇచ్చి తన కోరిక తీర్చుకున్నాడు.
ఈ విషయం తెలిసిన రేణుక భర్త, సోదరుడు ఏమి అనలేదు. అయితే ఆ పెన్ డ్రైవ్ లోని టి ఎస్ పి ఎస్ సి పరీక్షా పేపర్ ప్రింట్ అవుట్ చేసి అంతకు ముందే లింక్ లు పెట్టుకున్న వాళ్ళకు లక్షలల్లో అమ్ముకుని డబ్బు దండుకున్నారు.
ప్రేయసి కోసం హంతకుడిగా మారిన హరిహర కృష్ణ?
నిహారిక, నవీన్ ప్రేమికులు. చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఇద్దరు డేటింగ్ లో కూడా ఉన్నారు. నవీన్ బెస్ట్ ఫ్రెండ్ హరిహర కృష్ణకు ఈ విషయం తెలిసింది. నిహారిక అందానికి హరిహర కృష్ణ దాసుడయ్యాడు. ఆమెను మెల్లిగా తనవైపు తిప్పుకున్నాడు. ఆమె కూడా క్రమంగా నవీన్ని మరిచిపోయి హరిహర కృష్ణకు ప్రేయసిరాలిగా మారింది. ఇద్దరు చిట్టా పట్టాలు వేస్తూ తిరిగారు. ఈ విషయం నవీన్ కి తెలిసింది. ఆ ఇద్దరినీ తిట్టాడు. ముగ్గురు కొట్టుకున్నారు.
రాజ్ కపూర్ తీసిన ‘సంగం’ సినిమా లా ట్రై ఆంగిల్ లవ్ స్టొరీ లా మారింది. నిహారిక అటు నవీన్ తో ఇటు హరిహర కృష్ణతో తిరగడం మొదలు పెట్టింది. ఇద్దరితో సుఖపడుతూ, ఇద్దరినీ సుఖపెడుతూ తిరిగేదని హరిహర కృష్ణ చెప్పాడు.
ఆమెను సొంతం చేసుకోవాలని ఇద్దరూ పోటిపడ్డారు. ముందుగా హరిహర కృష్ణ నరరూప రాక్షసుడిగా మారాడు. నిహారిక తన సొంతం కావాలంటే నవీన్ని అడ్డు తోలగించుకోవాలి అనుకున్నాడు. నవీన్ని చంపి అటు నిహారికకు, ఇటు సమాజానికి దురామయ్యి కటకటాల పాలు అయ్యాడు. నిజం దాచి పరోక్షంగా హరి హర కృష్ణ కు సహకటించిన నిహారిక కూడా ఇప్పుడు నిండా మునిగింది.